‘ఆ తేదీల్లో ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు’

Mana Enadu : దేశంలో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు(Bomb Threats In India) వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బెదిరింపుల్లో చాలా వరకు ఫేక్ ఉండటంతో అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తరచూ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో విమానాల్లో ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) చేసిన ప్రకటన ఇటు ప్రజలతో పాటు అధికారుల్లో గుబులు రేపుతోంది. పన్నూ తాజాగా ‘ఎయిర్‌ ఇండియా’కు హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నవంబరు 1 నుంచి 19వ తేదీల మధ్యలో ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని వార్నింగ్ ఇచ్చాడు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్‌ ఇండియా విమానాల(Air India Planes)పై దాడి జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు.

ఈ క్రమంలోనే నవంబర్​ నెలలో పలు తేదీల్లో ఎయిర్ ఇండియా సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే పన్నూ (Pannun Latest Threat) ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది తొలిసారి కాదు. గత నవంబరులోనూ ఇలాంటి వీడియో విడుదల చేసి.. నవంబరు 19న దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని వార్నింగ్ ఇస్తూ వీడియో రిలీజ్ చేశాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం 2020లో పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం.

 

Share post:

లేటెస్ట్