ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. వేటకు వెళ్లొద్దంటూ వార్నింగ్..

ఆగస్టు మొదటి రెండు వారాల్లో వేడి, ఉక్కపోతతో అల్లడిన జనానికి.. ఉపశమనం కలిగించేలా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అల్పపీడన ప్రాంతంలోనే ఒక ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్ప పీడన ప్రభావంతో ఉత్తరకొస్తా, దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

ఆగస్టు మొదటి రెండు వారాల్లో వేడి, ఉక్కపోతతో అల్లడిన జనానికి.. ఉపశమనం కలిగించేలా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అల్పపీడన ప్రాంతంలోనే ఒక ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్ప పీడన ప్రభావంతో ఉత్తరకొస్తా, దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నందువల్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాగా, ఏపీలోని వేర్వేరు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని అల్లూరి, పార్వతీపురం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈనెల 21 వరకు ఏపీ తీరంలో వేటకు వెళ్ళద్దని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

  • Related Posts

    US Floods: టెక్సాస్‌లో వరదల బీభత్సం.. 51 మంది మృతి

    అగ్రరాజ్యం అమెరికా(America)ను భారీ వర్షాలు(Heavy Rains) విలయం సృష్టిస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా USలోని టెక్సాస్‌(Texas) రాష్ట్రాన్ని భారీ వరదలు(Floods) ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ఇక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.…

    Weather Today: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ఎఫెక్ట్.. ఇకపై జోరు వానలు!

    తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం(Low pressure effect) పెరిగిపోయింది. బంగాళఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఈ అల్పపీడనం ఏపీ, తెలంగాణ(Telangana)లపై విస్తరించింది. దీంతో గత 24 గంటలుగా అనేక జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. తాజాగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *