దుష్ట, దైవశక్తి యుద్దమే ఆదిపర్వం..ఈనెల ఆఖరికి గ్రాండ్​ రిలీజ్​

ManaEnadu:రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం “ఆదిపర్వం”. ఈ సినిమాలో మంచు లక్ష్మి( Manchu Lakshmi), ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా “ఆదిపర్వం”(AADIPARVAM) చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. “ఆదిపర్వం” సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 500కు పైగా థియేటర్స్ లో “ఆదిపర్వం” సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.

1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా “ఆదిపర్వం” సినిమాను రూపొందించారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధాన్ని ఆసక్తికరంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, టెక్నికల్ హంగులతో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా “ఆదిపర్వం” థియేటర్స్ లోకి వస్తుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు.

 

Related Posts

Akhanda2: అఖండ 2 కోసం రికార్డు స్థాయి బడ్జెట్.. బాలయ్య బిగ్ రిస్క్!

నందమూరి బాలకృష్ణ(Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ  2’ (Akanda2) సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.. వరుసగా నాలుగు హిట్లు కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య బాబు, ఇప్పుడు తన బ్లాక్‌బస్టర్…

సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి రెడీ.. జునైద్‌తో ‘ఏక్ దిన్’.. విడుదల ఎప్పుడంటే..

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్( Junaid Khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఏక్ దిన్(‘Ek Din’) ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) బాలీవుడ్‌(Bollywood…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *