టైగర్ నాగేశ్వరరావు టీసర్ రివ్యూ….పూనకాలు ఖాయం!!

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర(Ravanasura) సమ్మర్ లో రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయినా కానీ ఆ సినిమా తర్వాత రవితేజ ఏకంగా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న కొత్త సినిమా టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ కాబోతూ ఉండగా రవితేజ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచే అవకాశం ఉన్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడగా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు.

టీసర్ చూస్తూ ఉంటే కచ్చితంగా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచే అవకాశం ఉండనిపించేలా మెప్పించగా టీసర్ క్వాలిటీ, విజువల్స్ ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ బాగా మెప్పించాయి. 

ఇక రవితేజ లుక్ ని చూపించి చూపించనట్లు అనిపించేలా చిన్న గ్లిమ్స్ షాట్స్ తో మెప్పించగా ఎక్స్ లెంట్ ఎలివేషన్స్ తో స్టువర్ట్ పురంలో బిగ్గెస్ట్ దొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు రోల్ కి భారీగా పూనకాలు తెప్పించేలా ఎలివేషన్స్ తో మంచి హై ఇచ్చేలా తెరకెక్కించారు టీసర్ లో చూపించిన రేంజ్ లో సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించగలిగితే రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో టైగర్ నాగేశ్వరరావు సినిమా బిగ్ టర్నింగ్ పాయింట్ గా నిలవడం ఖాయం. ఇక సినిమా అక్టోబర్ 20న ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి. ఇక టైగర్ నాగేశ్వరరావు టీసర్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి

Share post:

లేటెస్ట్