Mana Enadu:టాలీవుడ్ నటుడు, రాజకీయ నేత నాగబాబు నిత్యం రాజకీయాల్లో, సినిమాలతో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ ఎన్నికల్లో ఆయన సోదరుడు, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘనవిజయం వెనుక నాగబాబు కష్టం కూడా ఉందన్నది నిజం. నాగబాబు ఓవైపు సినిమాలతో.. మరోవైపు జనసేన పార్టీ కార్యకలాపాలతో నిత్యం బిజీగా ఉంటారు. అయినా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. తరచూ సమకాలీన విషయాలపై పోస్టులు పెడుతుంటారు. తన మిత్రులు, సన్నిహితులకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటారు.
ఇక నాగబాబు తన అభిమానుల కోసం అప్పుడప్పుడు చేసే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ముచ్చట్లకు చాలా క్రేజ్ ఉంది. ఆయన ఈ సెషన్ లో అభిమానులు అడిగే క్వశ్చన్లకు ఇచ్చే సమాధానాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది అడిగే కొంటె ప్రశ్నలకు కూడా నాగబాబు చాలా ఓపికగా.. స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నట్లు సమాధానాలిచ్చి నవ్వులు పూయిస్తుంటారు. ఇక తన సమాధానాల్లో నాగబాబు ఎక్కువగా మీమ్స్ ను యూజ్ చేస్తూ నేటి యువతను ఆకట్టుకుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. మరి నెటిజన్ల ప్రశ్నలు.. నాగబాబు సమాధానాలేంటో ఓసారి చూద్దామా..?
మీరిక సినిమాల్లో నటించరా?
నాగబాబు: ఒకప్పుడు పెద్దగా చేసింది లేదు. ఇప్పుడు చేయకపోయినా పోయేదేం లేదు.
పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యారు కదా మరి ఇక సినిమాలు చేయరా?
నాగబాబు: అదీ ఉండాలి.. దాంతోపాటు ఇదీ ఉండాలి బోయపాటి శ్రీను వీడియో క్లిప్ షేర్ చేశారు)
మీరు ఎంపీ లేదా ఎమ్మెల్యే అవుతారనుకున్నాం?
నాగబాబు: సరే సర్లే.. అన్ని జరుగుతాయా ఏంటి.
నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్
నాగబాబు: నాక్కూడా అభిమానులు ఉంటారా?
పవన్‌కల్యాణ్‌కు సపోర్ట్‌గా ఉన్నందుకు కృతజ్ఞతలు..!
నాగబాబు: ఒక మహావృక్షానికి సపోర్ట్ అవసరమా?
అల్లు అర్జున్ గురించి ఏమైనా చెప్పండి?
నాగబాబు: మంచి హార్డ్ వర్కర్. పుష్ప 2 కోసం వెయిటింగ్.
మీ ఫేవరెట్ హీరో ఎవరు?
నాగబాబు: మా అన్నయ్య, తమ్ముడు. మా తర్వాత తరం. తలైవా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్.. ఇలా చెబుతా వెళ్తే చాలా పేర్లు ఉన్నాయి.
అకీరా, నిహారికపై మీ అభిప్రాయం ఏమిటి?
నాగబాబు: మర్యాద, సైలెంట్, ప్రేమించే మనస్తత్వం కలిగిన వాడు. నిహారిక నా దేవత.
మీకు ఫేవరెట్ క్రికెటర్ ఎవరు?
నాగబాబు: పవన్‌కల్యాణ్.. వందశాతం స్ట్రైక్ రేటు
మీ సినిమాల్లో మీకు ఇష్టమైన పాత్ర ఏమిటి?
నాగబాబు: బావగారు బాగున్నారాలో రంభను ఎత్తుకునే సీన్‌ని ఉద్దేశించి.. ఇది అయితే కాదు. ఎందుకంటే ఈ సీన్ తర్వాత నడుం పట్టేసింది.
పవన్‌కల్యాణ్‌ను ఎలా కలవాలి?
నాగబాబు: విజయవాడకు సమీపంలో మంగళగిరి ఉంటుంది. అక్కడికి వెళ్లి పవన్‌కల్యాణ్ ఇల్లు ఎక్కడ?అని అడిగితే ఎవరైనా అడ్రస్ చెబుతారు. ఇంటికి వెళ్లి కలిసి రా.. ఈ విషయం నేను చెప్పానని పవన్‌కల్యాణ్‌కు చెప్పకు మళ్లీ నాకు మాట వస్తుంది.
మిమ్మల్ని చూస్తుంటే వరుణ్ తేజ్‌కు బ్రదర్ లా ఉన్నారు?
నాగబాబు: వినడానికి భలే ఉంది. (‘కిక్’లో బ్రహ్మానందం వీడియో క్లిప్ షేర్ చేశారు)