ప్రయాణికులకు అలర్ట్.. దీపావళికి 804 ప్రత్యేక రైళ్లు

Mana Enadu : దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దసరాకు కూడా ప్రత్యేక రైళ్లను నడిపింది. ఇక తాజాగా ప్రయాణికుల సౌకర్యార్థం దీపావళి(Diwali), ఛత్ పండుగల సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే 804 ప్రత్యేక రైళ్ల(Special Trains)ను నడిపిస్తున్నట్లు వెల్లడించింది.

గత సీజన్​లో 626 స్పెషల్ ట్రైన్స్

గత సీజన్​లో ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే 626 ప్రత్యేక రైళ్లను నడిపించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి అదనంగా మరో 178 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) తెలిపింది. దీపావళి, ఛత్(Chhath Festival) పండుగల సీజన్ దృష్ట్యా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, దిల్లీ రాష్ట్రాలకు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని తెలిపింది. రద్దీకి అనుగుణంగా ప్రధాన స్టేషన్ల నుంచి రైళ్లు నడుపుతున్నట్లు చెప్పింది.

ప్రధాన స్టేషన్ల నుంచి రైళ్లు

ఈ క్రమంలోనే ప్రధాన స్టేషన్లయిన సికింద్రాబాద్, హైదరాబాద్(Hyderabad), కాచిగూడ తదితర స్టేషన్​ల నుంచి.. షాలిమార్, రక్సాల్, జైపూర్, లాల్ఘర్, హిసార్, గోరక్ పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చి వంటి ఇతర రాష్ట్రాల్లోని స్టేషన్ల వైపు కూడా ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మధురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వేల్, దాదర్ ప్రాంతాలకు కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు పేర్కొంది.

యూటీఎస్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్

ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వ్​డ్ కోచ్​లు(Reserved Coaches in Trains), అన్ రిజర్వ్​డ్ కోచ్​లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అన్​రిజర్వ్​డ్ కోచ్​లలో ప్రయాణించాలనుకునే వారి కోసం జనరల్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా టికెట్లు యూటీఎస్(UTS App) మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసుకొనే సదుపాయం కల్పించినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Share post:

లేటెస్ట్