ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలపై ఒక్కో సర్వే వెల్లడవుతోంది. ఇప్పటికే ప్రధాన మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తెదేపా, జనసేన, భాజపా కూటమికి విజయం కట్టబెట్టగా.. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ టీవీ 9 రవి ప్రకాశ్ సర్వే ఒకటి బయటికొచ్చింది.
రవిప్రకాశ్‌కు చెందిన ఆర్ టీవీ పేరిట విడుదలైన ఈ ప్రీపోల్ సర్వే సైతం వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేన కూటమి జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెప్పింది. 175 స్థానాలకు గానూ.. 132 స్థానాలు కూటమి, 41 స్థానాలు అధికార వైసీపీ కి, మరో రెండు స్థానాల్లో ఇతరులు గెలిచే అవకాశమున్నట్టు తేల్చింది. ఆ రెండు స్థానాల్లో ఒకటి భాజపా, మరొకటి కాంగ్రెస్ పంచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వ ఏర్పాటు లాంఛనంగా కనిపిస్తోంది.