వైట్ ఎగ్స్ Vs బ్రౌన్ ఎగ్స్.. వేటిలో పోషకాలు ఎక్కువ?

ManaEnadu : నాన్​వెజ్ తినడానికి ఇష్టపడని చాలా మంది కోడిగుడ్లు (Eggs) మాత్రం తింటారు. అసలు కోడుగడ్డు కూడా వెజిటేరియన్ ఫుడ్ కిందకే వస్తుందని అంటుంటారు. ఇక రోజులో కనీసం రెండు నుంచి మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లు (Boiled Eggs) తింటే మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం మనకు దుకాణాల్లో దొరికే బ్రాయిలర్ ఎగ్స్​ తింటే పెద్దగా ప్రయోజనం ఉండదని, వైట్ ఎగ్స్ కంటే బ్రౌన్ ఎగ్స్ తింటేనే ఆరోగ్యానికి మంచిదని అంటారు. ఇంతకీ వైట్ ఎగ్స్ Or బ్రౌన్ ఎగ్స్ వేటిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి?

వేటిలో పోషకాలు ఎక్కువ?

దాదాపుగా మన దగ్గర షాపుల్లో ఎక్కువగా వైట్ ఎగ్స్ (White Eggs) అదేనండి ఫారం ఎగ్స్ అమ్ముతుంటారు. అయితే సూపర్ మార్కెట్లు, డీమార్ట్, రత్నదీప్, విశాల్ మార్ట్, విజేత సూపర్ మార్కెట్, మోర్ ఇలాంటి సూపర్ బజార్లలో తెల్లని కోడిగుడ్లతో పాటు ముదురు గోధుమ రంగులో ఉండే (Brown Eggs) కూడా లభిస్తాయి. అయితే చాలా మంది వైట్ ఎగ్స్ కంటే బ్రౌన్ ఎగ్స్​లోనే పోషకాలు ఎక్కువ ఉంటాయని అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ అని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

వైట్ Vs బ్రౌన్ ఎగ్స్

2019లో వైట్, బ్రౌన్ ఎగ్స్​పై ఈ పరిశోధకులు తమ పరిశోధన చేశారు. వీరి రీసెర్చ్​లో రెండు గుడ్లలో పోషకాలు దాదాపు సమానంగా ఉన్నాయని తేలింది. ఈ పరిశోధనను న్యూట్రియంట్స్ జర్నల్ (Journal of Nutrients) ప్రచురించింది. కోడి గుడ్డు పెంకు రంగులో మాత్రమే తేడా ఉంటుందనీ.. అందులోని పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయని, కోడి జాతులను బట్టి అవి పెట్టే గుడ్ల రంగు ఆధారపడి ఉంటుందని హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​కు చెందిన ‘డాక్టర్​ జీన్-ఫిలిప్ డ్రౌయిన్-చార్టియర్ అన్నారు.

అందుకే ధర ఎక్కువ

తెల్లటి కోడి గుడ్ల​ను అండలూసియన్ (andalusian), వైట్ లైఘోర్న్ అనే జాతులు అధికంగా ఉత్పత్తి చేస్తుండగా.. గోల్డెన్ కామెట్, రోడ్ ఐలాండ్ రెడ్, గోల్డ్ చికెన్ జాతులు బ్రౌన్ రంగు పెంకులతో ఉండే గుడ్లను ఉత్పత్తి చేస్తుంటాయట. బ్రౌన్ గుడ్లలో ప్రోటోపోర్ఫిరిన్ అనే పర్ణద్రవ్యం ఉంటుందని.. అందువల్లే వాటి పెంకు ఆ కలర్​లో ఉంటుందని నిపుణులు తెలిపారు. పోషకాలు, టేస్ట్​ పరంగా చూస్తే.. రెండూ ఒకేలా ఉంటాయని చెబుతున్నారు. అయితే వైట్ ఎగ్స్ కంటే బ్రౌన్ ఎగ్స్ ధర (Brown Eggs Price) కాస్త ఎక్కువే. ఎందుకంటే ఈ రంగు గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్ల జాతులు తక్కువగా ఉన్నాయట. మరోవైపు ఈ కోళ్లను పెంచేందుకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుండటంతో ఈ గుడ్లకు ధర కాస్త ఎక్కువట.

Share post:

లేటెస్ట్