హైదరాబాద్‌లో భారీగా గంజాయిని లంగర్ హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి రూపాయలు విలువైన గంజాయిని లంగర్ హౌస్ పోలీసులు సీజ్ చేశారు. ఆరుగురు గంజాయి సప్లయర్లు అరెస్ట్, కోటి రూపాయల గంజాయిని సీజ్ చేశారు.
హైదరాబాద్‌లో భారీగా గంజాయిని లంగర్ హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి రూపాయలు విలువైన గంజాయిని పోలీసులు నేటి ఉదయం సీజ్ చేశారు. ఆరుగురు గంజాయి సప్లయర్లను అరెస్ట్ చేశారు. అలాగే కోటి రూపాయల విలువైన గంజాయిని సీజ్ చేశారు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాపై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. పక్కా సమాచారంతో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఇంటర్నేషనల్ స్థాయిలో నైజీరియన్స్ డ్రగ్ సప్లై చేస్తున్నారు.
11 లక్షల విలువైన డ్రగ్స్‌ను నార్కోటిక్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ సీజ్ చేసింది. ఈ కేసులో ఒక నైజీరియన్ అరెస్ట్ అయ్యారు. నేటి మధ్యాహ్నం నిందితులను పోలీసుల ముందు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రవేశ పెట్టనున్నారు.