ManaEnadu:ప్రస్తుత సమాజంలో క్రైమ్ రేట్ (Crime Rate) విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న చిన్న కారణాలతోనే కొందరు ఆత్మహత్యలు (Suicide) చేసుకుంటున్నారు. మరికొందరేమో చిన్న కారణాలకే క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే దిల్లీ (Delhi News)లో చోటుచేసుకుంది. ముగ్గురు స్నేహితులు కలిసి వారి మరో మిత్రుడిని కత్తితో పొడిచారు. దీనికి కారణం ఏంటో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
దిల్లీలోని షకర్‌పుర్ ప్రాంతంలో సచిన్ అనే యువకుడు కొత్త ఫోన్ (Mobile Phone) కొనుగోలు చేయడానికి స్నేహితుడిని తీసుకొని షాప్ నకు వెళ్లాడు. ఫోన్ కొనుగోలు చేసిన అనంతరం వారు ఇంటికి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో దారిలో వారికి మరో ముగ్గురు స్నేహితులు కలిశారు. సచిన్ వద్ద కొత్త ఫోన్ చూసిన ఆ స్నేహితులు మొబైల్ కొన్నందుకు తమకు పార్టీ ఇవ్వాలని కోరారు. అయితే దానికి యువకుడు నిరాకరించాడు. ఈ క్రమంలో వారి మధ్య చిన్నగా వాగ్వాదం మొదలైంది. అది కాస్త తీవ్రమై ఘర్షణకు దారి తీయడంతో ఆ స్నేహితుల్లో ఓ యువకుడు సచిన్‌ను కత్తి (Stabbed)తో పొడిచారు.
గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సచిన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో కత్తి స్వాధీనం చేసుకున్న పోలీసులు (Delhi Police).. ఈ దారుణానికి పాల్పడిన యువకులు ముగ్గురు 16 ఏళ్ల వయసువారే అని చెప్పారు. మృతదేహాం వెనుక భాగంలో రెండు కత్తిపోట్లు ఉన్నట్లుగా గుర్తించామని .. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.