Mana Enadu: న్యూజిలాండ్(New Zealand)తో తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత భారత జట్టు(Team India)లో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ జట్టుతో మిగిలిన రెండు టెస్టులకు ఆలౌరౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar)ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు BCCI ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 24 నుంచి పుణె(Pune) వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు సుందర్ జట్టుతో కలవనున్నాడు. తొలి మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) చేరాలంటే భారత్‌కు మిగతా రెండు టెస్టుల్లో గెలవడం కీలకం.
చివరి 2 టెస్టులకు భారత్ 16 మంది
బేసిక్‌గా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్(spin bowling all-rounder) అయిన సుందర్ టీమ్ఇండియా తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు ఆడాడు. బ్యాటింగ్‌లో 265 రన్స్ చేశాడు. అటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్‌లో సుందర్ (152; 269 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడుకు ఆడుతున్న సుందర్ త్వరలోనే జట్టుతో కలుస్తాడని BCCI ఆదివారం సాయంత్రం వెల్లడించింది. చివరి 2 టెస్టులకు భారత్ 16 మంది బృందంతో కొనసాగనుందని బోర్డు స్పష్టం చేసింది.
కేఎల్‌పై వేటు తప్పదా..
మరోవైపు టీమ్‌ఇండియా బ్యాటర్ KL రాహుల్‌పై మిగతా రెండు టెస్టులకు వేటు పడే అవకాశం కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన KLను పక్కన పెట్టి మరో యువ ఆటగాడికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కివీస్‌పై ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన రాహుల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 12 పరుగులే చేశాడు. ఈ ఏడాది 8 ఇన్నింగ్స్‌ల్లో అతడు 234 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతోపాటు ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో రాహుల్ ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
కివిస్‌తో 2,3 టెస్టులకు టీమ్ఇండియా
రోహిత్ శర్మ (C), జస్‌ప్రీత్ బుమ్రా (VC), జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (WK), ధ్రువ్ జురెల్ (WK), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.