30 రోజుల్లో 80 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం!

Mana Enadu : మెటాకు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ఇక భారతదేశంలో కోట్లాది మందికి ఇదే సందేశ సాధనం. అయితే టెక్నాలజీతో ఎంత ఉపయోగం ఉంటుందో అంత డేంజర్ కూడా ఉంటుదన్నది అందరికీ తెలిసిన సత్యం. అందుకే వాట్సాప్ ను అదునుగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు దీన్ని అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

ఇటీవల కాలంలో వాట్సాప్ (WhatsApp Cyber Crimes) లో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో భారీ సంఖ్యలో ఖాతాలను వాట్సాప్‌ బ్యాన్ చేసింది. ఒక్క ఆగస్టులోనే సుమారు 80 లక్షల ఖాతాలపై నిషేధం (WhatsApp Accounts Ban) విధించింది. కంపెనీ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వాట్సాప్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఐటీ యాక్ట్‌, 2021 నిబంధనలను అనుసరించి ఆగస్టు నెలలో భారీ సంఖ్యలో ఖాతాలపై నిషేధం విధించినట్లు వెల్లడించింది.

“మొత్తం 84.58 లక్షల ఖాతాలపై చర్యలు చేపట్టాం. ఇందులో సుమారు 16.61 లక్షల ఖాతాలను ముందు జాగ్రత్త చర్యగా బ్యాన్‌ చేశాం. మోసానికి ఆస్కారం ఉండే బల్క్‌ మెసేజ్‌లు లేదా అసాధారణ మెసేజ్‌లను వాట్సాప్‌  ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ (Automated System) ద్వారా ముందుగానే గుర్తించి ఈ చర్యలు చేపట్టింది.  ఆగస్టులో గ్రీవెన్స్‌ మెకానిజం ద్వారా యూజర్ల నుంచి 10,707 ఫిర్యాదులు అందాయి.” అని వాట్సాప్ వెల్లడించింది.

వాట్సాప్‌ టర్మ్స్‌ అండ్‌ కండీషన్లను ఉల్లంఘించినందుకు వాట్సాప్‌ ఈ తరహా చర్యలు తీసుకుంటుందని ఈ సంస్థ తెలిపింది. మోసం లేదా తప్పుడు సమాచారం (WhatsApp Fake News) చేరవేతకు బల్క్‌, స్పామ్‌ మెసేజులు పంపించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అనుచిత ప్రవర్తన, వేధింపులు వంటి విషయాల్లో యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత ఖాతాలను బ్యాన్ చేస్తామని స్పష్టం చేసింది.

Share post:

లేటెస్ట్