Acidity: ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇవి తినండి!

రోజూ ఉరుకులు పరుగుల జీవితం(Busy Life).. టైమ్‌కి తినడమూ కుదరని పరిస్థితి. కంటి నిండా నిద్రపోని రోజులు.. ఇవన్నీ ప్రస్తుత ప్రజల తీరు. వృత్తి, వ్యక్తిగత జీవితం(Career, personal life)లో పని ఒత్తిడి(Work stress) కారణంగా ఇలాంటివి ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యే. కాకపోతే కొందరు బయటపడతారు. మరికొందరు పడరు. ముఖ్యంగా బయట ఫుడ్(Outside Food) అతిగా తినడం, అది అరగడం కోసమంటూ కూల్ డ్రింక్స్(Cool Drinks) బొజ్జనిండా తాగడం చేస్తుంటాం. అయితే అతిగా డ్రింక్స్ తాగడం, కడుపులో అల్సర్లు వంటివాటితో ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో ఈ ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. అయితే తరచూ ఎసిడిటీ(Acidity) సమస్యతో బాధపడుతున్నవారు కొన్ని రకాల ఆహారాన్ని తమ డైట్‌లో భాగంగా చేసుకుంటే సహజ పద్ధతుల్లో ఈ సమస్య నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే..

అరటి పండ్లు(Bananas)

అరటి పండ్లు(Bananas) స్వల్పంగా ఆల్కలైన్ (క్షార) స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఎసిడిటీకి విరుగుడుగా పనిచేస్తాయి. అంతేకాదు అరటి పండ్లలోని పెక్టిన్ అనే ఎంజైమ్ మన జీర్ణాశయం, పేగుల లోపలి పొరపై ఒక రక్షణ పూతలా పేరుకుంటుంది. ఎసిడిటీ వల్ల వచ్చే మంట, ఇతర ఇబ్బందులను తగ్గిస్తుంది.

 ఆకుకూరలు, కూరగాయలు(Curries and vegetables)
పాలకూర, చుక్కకూర, తోటకూర వంటి ఆకుకూరలు, క్యాబేజీ, బ్రాకొలీ వంటివి కూడా ఆల్కలైన్ లక్షణాలు ఉండేవే. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

 దోసకాయలు(Cucumbers)
తరచూ తీసుకునే ఆహారంలో దోసకాయలు కూడా సహజమైన ఆల్కలైన్ లక్షణాలు కలిగి ఉన్నవే. అంతేకాదు వీటిలో నీటి శాతం కూడా ఎక్కువే. అందువల్ల అటు కడుపులోని యాసిడ్లను నిర్వీర్యం చేయడమే కాదు శరీరం నుంచి బయటికి పంపడానికి కూడా తోడ్పడుతాయి. రోజూ ఓ పూట సలాడ్ గా దోసకాయ తింటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అల్లం(ginger)
శరీరంలో ఇన్‌‌ఫ్లమేషన్‌‌ను తగ్గించడంలో అల్లం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయంలో యాసిడ్లను నిర్వీర్యం చేసి ఉపశమనం ఇస్తుంది. అదే సమయంలో ఆహారం బాగా జీర్ణం అయ్యేందుకూ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అవకాడోలు(Avocados)
వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ. అదే సమయంలో ఆల్కలైన్ లక్షణాలు కూడా అవకాడోలకు ఉన్నాయి. ఇది ఎసిడిటీని తగ్గించేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు అవకాడోల్లో విటమిన్లు, పొటాషియం వంటి ఖనిజాలవణాలు కూడా ఎక్కువే.

పుచ్చకాయ(watermelon)
దోసకాయల తరహాలోనే పుచ్చకాయల్లో కూడా ఆల్కలైన్‌ లక్షణాలు ఉంటాయి. అవి ఎసిడిటీతోపాటు అల్సర్లు వంటివాటి ఇబ్బందులను తగ్గించడానికి తోడ్పడుతాయి.

 బాదం(Badam)
డ్రైఫ్రూట్స్‌లో భాగమైన బాదం పప్పులు కూడా ఆల్కలైన్ లక్షణాలు ఉన్నవే. ఇవి ఎసిడిటీని తగ్గించడంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి.

 చిలగడ దుంపలు(Sweet potatoes)
చిలగడ దుంపల్లోనూ ఆల్కలైన్‌ లక్షణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఎసిడిటీని తగ్గించడంతోపాటు అల్సర్లు, ఇతర ఇబ్బందుల సమస్యలకు కూడా ఉపశమనం ఇస్తుందని వివరిస్తున్నారు.

Related Posts

పీరియడ్స్ సమయంలో తలస్నానం హానికరమా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు,…

Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త

హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్‌(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *