చలికాలం (winter) మొదలైంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. చలిగాలులు, పొడి వాతావరణం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. ఈ సీజన్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు (seasonal diseases) వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్వాససోష సంబంధిత సమస్యలైన ఆస్తమా (asthma) వంటి వాటితో బాధపడేవారు.. ఈ సీజన్లో మరింత ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు ఇలాంటి కొన్ని చిట్నాలు పాటించి ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.
అల్లం టీ
ఆస్తమా సమస్య ఉన్నవారు చలికాలంలో అల్లం టీ (ginger tea)తాగడం ఎంతో మంచిది. ఇది శరీరానికి వెచ్చదనం అందించి ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం రోగనిరోధన శక్తిని సైతం పెంచుతుంది.
తులసి టీ
తులసి ఆకులను (tulsi tea) నీటిలో మరిగించి తాగడం ద్వారా ఆస్తమా నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఈ టీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
లికోరైస్ టీ
ఆస్తమా సమస్య నుంచి లికోరైస్ (అతిమధురం) టీ (licorice tea) బయటపడేస్తుంది. చలికాలంలో పొడిని వెచ్చని నీటిలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
వ్యాయామం
ఆస్తమా ఉన్నవారు ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం (exercise) చేయాలి. ధ్యాయం, యోగాతో ఆస్తమా సమస్య నుంచి ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఉదయం చలి తీవ్రత తగ్గిన తర్వాత బయటకు వచ్చి వీటి సాధన చేయాలి. ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉన్నవారు ఇంట్లోనే యోగా, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు.
వాటికి దూరంగా..
ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారు దుమ్ము, దూళి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంచరించడం ద్వారా సమస్యను మరింత తీవ్రతరం చేసుకున్నవారు అవుతారు. దుమ్ము, దూళి ఉన్న ప్రాంతాల్లో తిరగకుఊడదు. చెత్త కాల్చే ప్రదేశంలోనూ ఉండకూడదు. బయటకు వెళ్లే టప్పుడు మాస్క్ ధరించండి.
ధూమపానం చేయొద్దు
ఆస్మమా ఉన్నవారు smoking అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ధూమపానం కారణంగా గొంతులో కఫం పేరుకుపోయి ఆస్తమా రోజుల పరిస్థితిని మరింత తీవ్ర తరం చేస్తుంది. అందుకే ధూమపానం చేయవద్దు.
ఆహార పద్ధతులు ఇలా..
ఆస్తమా ఉన్నవారు చలికాలంలో మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం (diet) తీసుకోకూడదు. ఫ్రైడ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు తినాలి. భోజనం వేడిగా ఉన్నప్పుడే తినాలి.








