నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ కమిషన్(Telangana Public Commission) శుభవార్త చెప్పింది. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల(Group-3 Exams)కు సంబంధించిన ప్రిలిమినరీ కీ(Preliminary key)ని తాజాగా రిలీజ్ చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్సైట్ ద్వారా TGPSC ఐడీ, Hall Ticket No, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి KEYని పొందొచ్చు. 12వ తేదీ వరకు గ్రూప్-3 కీ అందుబాటులో ఉండనుంది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను జనవరి 12 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రూప్-3 ప్రిలిమినరీ కీతో పాటు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్(Town Planning Building Overseer) ఫలితాలను కూడా TGPSC విడుదల చేసింది.
50 శాతం మందే హాజరయ్యారు
అలాగే అభ్యంతరాలను ఇంగ్లిష్(English) తెలపాలని, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్లైన్(Online)లోనే పంపాలని సూచించారు. గ్రూప్-3 పరీక్షలను TGPSC 2024 నవంబర్ 17, 18వ తేదీల్లో నిర్వహించింది. మొత్తం 1365 పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మూడు పేపర్లకు నిర్వహించిన ఈ పరీక్షలకు 50 శాతం మందే హాజరవ్వడం గమనార్హం.
వెబ్సైట్: https://www.tspsc.gov.in/






