ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy-2025) గ్రాండ్‌గా ప్రారంభమైంది. తొలిపోరు ఆతిథ్య పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఇక ఈ మినీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్(Team India) తన వేట నేటి (ఫిబ్రవరి 20) నుంచి ప్రారంభించనుంది. దుబాయ్(Dubai) వేదిగకగా మధ్యాహ్నం 2.30కు బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగే ఈ పోరుకు రోహిత్ సేన అన్నివిధాలా సిద్ధమైంది. ఇటీవల ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. అదే ఊపులో ఛాంపియన్స్ ట్రోఫీని పట్టేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు వన్డేల్లో బంగ్లాపై భారత్‌దే పైచేయిగా ఉంది. రెండు జట్ల మధ్య 41 మ్యాచులు జరిగితే టీమ్ఇండియా 32 నెగ్గగా.. బంగ్లా ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించింది.
తుది జట్టులో ఎవరు?
ఇక ఈ టోర్నీలో టీమిండియా ఫైనల్ లెవన్ కూర్పుపై మల్లగుల్లాలు పడుతోంది. ఏ ఆటగాడిని రిజర్వ్‌కు పరిమితం చేయాలో, ఎవరినీ ఆటగాడించాలనే అనే సందిగ్ధం టీమ్ మేనేజ్మెంట్ను వేధిస్తోంది. దీంతో బంగ్లాకు ముందు భారత్ ప్లేయింగ్ లెవన్ ఎలా ఉండబోతోందోనని అటు అభిమానులతోపాటు ఇటు విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Bumrah) గాయంతో టోర్నీకి దూరం కావడం కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Shami) ఉన్నప్పటికీ, అతనికి తోడుగా ఎవరినీ ఆడించాలనే విషయంపైనా ఆందోళనలో ఉంది.
పాక్‌కు షాకిచ్చిన కివీస్
కాగా నిన్న జరిగిన తొలి మ్యాచులో పాకిస్థాన్(PAK)పై న్యూజిలాండ్(NZ) 60 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 320/5 రన్స్ చేసింది. ఛేదనలో పాక్ 47.2 ఓవర్లలో 260 పరుగులకే కుప్పకూలింది. సెంచరీతో చెలరేగిన కివీస్ బ్యాటర్ టామ్ లాథమ్‌కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది. కాగా పాక్ తన రెండో మ్యాచ్ ఈ నెల 23న భారత్‌తో ఆడనుంది.
IND vs BAN తుది జట్ల అంచనా
INDIA: రోహిత్ శర్మ (C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
BANGLADESH: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (C), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(WK), మహ్మదుల్లా, జాకర్ అలీ / తౌహిద్ హృదయ్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, నహిద్ రానా, తంజిమ్ సకీబ్/ముస్తాఫిజుర్ రహ్మాన్
Predicted playing XI for IND vs BAN Champions Trophy 2025:
Rohit Sharma (C)
Shubman Gill (VC)
Virat Kohli
Shreyas Iyer
KL Rahul
Hardik Pandya
Ravindra Jadeja
Axar Patel
Varun Chakaravarthy
Mohammed Shami
Arshdeep Singh#ChampionsTrophy #IndvsBan #PAKvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/ecbi2zifuf— Third Men (@MenThird) February 19, 2025






