సంగీత్ శోభన్ (Sangeet Shoban) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా ‘గ్యాంబ్లర్స్’ (Gamblers). ప్రశాంతి చారోలింగా (Prashanthi Charuolingah), ఫృథ్వీరాజ్ బన్నా, సాయి శ్వేత, జబర్దస్త్ రాకేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాకు కేఎస్కే చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సునీతా రాజ్ కుమార్ బృందావన్ నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ముస్తాబవుతున్న ఈ చిత్రం జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ఈ మూవీ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఓ ఐలాండ్‌లో నిర్వహించే క్యాసినో, పేకాట నేపథ్యంలో కొంత మంది మధ్య నడిచే థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ‘యుద్ధం ఎక్కడ మొదలు పెట్టాలో తెలియాలి.. జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి’ అనే డైలాగుతో ప్రారంభమైన టీజర్ ఆసక్తికరంగా ఉంది.






