Kamal Haasan : 70 ఏళ్ల వయసులో కమల్ హసన్ లిప్ లాక్ సీన్స్.. నెటిజన్ల ట్రోల్స్ 

కమల్ హాసన్ హీరోగా మణిరత్నం డైరెక్షన్ లో జూన్ 5 న విడుదల కానున్న థగ్ లైఫ్ (Thug Life) సినిమా ట్రైలర్ అదరగొడుతోంది. జూన్ 5న తెలుగు, హిందీ, తమిళ లాంగ్వేజ్ లో సినిమా విడుదల చేసేందుకు ప్రొడక్షన్ టీం సిద్ధమైంది. ట్రైలర్ మొత్తం ఎక్కువగా గ్యాంగ్ స్టర్ లతో ఫైట్ సీన్లలో నిండిపోగా.. కొన్ని సన్నివేశాలు మాత్రం కమల్ హాసన్ త్రిష, అభిరామిలతో రొమాన్స్ చేసే సీన్స్ ఉన్నాయి. దీంతో నెటిజన్లు డిఫరెంట్ గా స్పందిస్తున్నారు.

 

త్రిషతో కమల్ హాసన్ రొమాన్స్

 

70 ఏళ్ల కమల్‌, 42ఏళ్ల త్రిష (Trisha) ఇద్దరి మధ్య రొమాన్స్ సీన్స్ పెట్టడం ఏంటని ట్రోల్స్ చేస్తున్నారు. కమల్ హాసన్ కంటే వయసులో ఎంతో చిన్నదైనా అభిరామితో లిప్ లాక్ సీన్ ఏకంగా ట్రైలర్ లో పెట్టడంతో ఒక్కసారిగా సినిమా కంటే లిప్ లాక్ సీన్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. కానీ దీనికి సంబంధించి డైరెక్టర్ మణిరత్నం నెగిటివ్ ప్రచారం చేసే వారికి కౌంటర్ ఇచ్చారు.

 

మణిరత్నం కౌంటర్.. 

 

అయితే సినిమాను సినిమాల చూడాలి. దాన్ని వయసుతో ముడిపెట్టొద్దు. నిజ జీవితంలో చాలా మంది తక్కువ వయసున్న వారితో, లేదా ఎక్కువ వయసు వారితో రిలేషన్ షిప్ లో ఉంటారు. ఏ విషయాన్నైనా తప్పు అని ఎత్తి చూపడం ఈజీ. కానీ కొంతమంది వారి అభిప్రాయాల్ని గౌరవించాలని కోరుకుంటారు. కొంతమంది సమర్థించాలని అనుకుంటారు. కానీ ఒక్క ట్రైలర్ చూసి వారిద్దరి మధ్య బంధాన్ని ఎలా డిసైడ్ చేస్తారు. సినిమాలో వారి క్యారెక్టర్ ఏంటి వాళ్లు అసలు ఎందుకలా ఉన్నారు అనేది ఏదీ తెలుసుకోకుండానే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. మీరు చూసింది చూడబోయేది వారి బంధం ఎలా ఉండబోతుంది తెలుసుకుని అప్పుడు అభిప్రాయాల్ని చెప్పాలని మణిరత్నం అన్నారు. ఈ చిత్రంలో శింబు (Simbu) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *