శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ ఈ నెల 20న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా బిచ్చగాడిగా ధనుష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలారోజుల తర్వాత మళ్లీ జోష్ కనిపిస్తోంది. ‘కుబేర’ రిలీజ్‌కి ముందు పెద్ద హడావుడి గానీ హైప్ గానీ లేదు. తొలిఆట తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే తొలిరోజు వసూళ్లలో మంచి నంబర్స్ కనిపించాయి.

నాగార్జున, శేఖర్ కమ్ములకు హైయ్యెస్ట్ కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు గానీ, తమిళనాడులో మాత్రం సాంకేతిక కారణాలతో విడుదలకు ముందురోజు బుకింగ్స్ తెరిచారు. అయినా సరే మౌత్ టాక్ ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్‌గా వస్తోంది. అలా తొలిరోజు తెలుగు, తమిళంలో కలిపి రూ.13 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు వసూళ్ల బట్టి చూస్తే ధనుష్‌కి కెరీర్ పరంగా ఇది రెండో బిగ్గెస్ట్ కలెక్షన్ కాగా.. నాగార్జున, శేఖర్ కమ్ములకు మాత్రం ఇదే అత్యధికం. పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నంబర్స్ ఇంకా పెరగొచ్చు. దీంతో నిర్మాతలతోపాటు చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది.

ధనవంతుడు, బిచ్చగాడికి మధ్య జరిగే పోరాటం
అత్యంత ధనవంతుడు, ఏమీ ఆశించని ఓ బిచ్చగాడికి మధ్య జరిగే పోరాటమే కుబేరా. బిచ్చగాడి పాత్రలో ధనుష్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కనబరిచారు. నాగార్జున, రష్మిక పాత్రలు కూడా మెప్పించాయి. ఫస్టాఫ్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ అనిపించదు. అనుకోని పరిస్థితుల్లో ఆపదలో ఇరుక్కున్న రష్మిక కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. సెకండాఫ్ ఫ్రీ క్లైమాక్స్‌లో కాస్త సాగదీతగా అనిపించింది. మూవీ రన్ టైమ్ 3 గంటలపైనే ఉండడంతో కొన్ని చోట్ల మినహా సినిమా బోర్ కొట్టకుండా ముందుకు సాగుతుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Kuberaa box office collection day 1: Dhanush and Nagarjuna film earns ₹13 crore, much lower than Raayan #Kubera #dhanush pic.twitter.com/Fg7Lqy3BVT
— light camera action🎥 (@thesonalisingh) June 21, 2025






