ప్రముఖ తెలుగు సినీ నటుడు రవితేజ(Ravi Teja) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా భూపతి రాజు రాజగోపాల్ (Bhupathi Raju Rajagopal) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రాజు మరణవార్త తెలియగానే తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Industry)లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రవితేజ సన్నిహితులు, సహనటులు, అభిమానులు సోషల్ మీడియా(Social Media) వేదికల ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. రవితేజ తన తండ్రితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారని సమాచారం.
ఫార్మసిస్ట్‌గా పని చేసేవారు..
భూపతి రాజగోపాల్ రాజు స్వగ్రామం ఆంధ్రప్రదేశ్(AP)లోని జగ్గంపేట. ఆయన ఫార్మసిస్ట్‌గా పని చేసేవారు. వృత్తిరీత్యా పలు ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి రావడంతో తాను అనేక ప్రాంతాలు చిన్నప్పుడే తిరగాల్సి వచ్చిందని రవితేజ పలు సందర్భాలలో పంచుకున్నారు. ఇక రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు. వారిలో ఒకరు రవితేజ(Ravi Teja) కాగా మరొకరు రఘు(Raghu), అలాగే భరత్ రాజు(Bharath Raju). కాగా భరత్ 2017లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. కాగా రాజగోపాల్ రాజు మృతి పట్ల రవితేజ కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాజగోపాల్ రాజు ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
#Raviteja father Rajagopal Garu passed away last night at his residence in Hyd 💔
May His Soul Rest In Peace 🙏🏻
Stay Strong @RaviTeja_offl annayya pic.twitter.com/ZK8O9GCxFA— Raghavendra (@Raghava907) July 16, 2025






