Paradha: లీడ్ రోల్‌లో అలరించినున్న అనుపమ పరమేశ్వరన్.. మూవీ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరదా(Paradha)’. ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా స్త్రీ అస్తిత్వంపై ఆధారపడిన కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘టిల్లు స్క్వేర్(Tillu Squre)’ వంటి సూపర్ హిట్ తర్వాత అనుపమ ఈ సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో డీ-గ్లామర్ లుక్‌లో కనిపించనుంది. ఈ సినిమాలో దర్శనా రాజేంద్రన్(Darshana Rajendran), సంగీత (Sangeetha)వంటి నటీమణులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే డ్రామాతో రూపొందింది.

Paradha' first look: Anupama Parameswaran and Darshana Rajendran to play the leads in female-oriented drama | - Times of India

ఫ్యాన్సీ ధరకే ‘పరదా’ ఓటీటీ రైట్స్‌

కాగా ‘పరదా’ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైం వీడియో(Amazon Prime Video) ఫ్యాన్సీ రేట్‌కు దక్కించుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మహిళా కేంద్రిత కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అనుపమ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నుంచి థీమ్ ఆఫ్ పరదా ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా..’ అనే పాటను తాజాగా రిలీజ్​ చేశారు. వనమాలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) పాడారు. ఈ సాంగ్ సోషల్ మీడియా(SM)లో మంచి టాక్ తెచ్చుకుంది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *