కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రి(Union Home Minister)గా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. 2019 మే 30న ఈ పదవిని చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అమిత్ షా అదే మినిస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన మొత్తం 2,258 రోజులు హోంమంత్రిగా పనిచేశారు, ఇది ఒక కొత్త మైలురాయి. ఈ ఘనతతో ఆయన భారత రాజకీయా(Indian Politics)ల్లో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నారు. అమిత్ షా ఈ రికార్డును సాధించడం ద్వారా భారతీయ జనతా పార్టీ (BJP)లో సీనియర్ నేతగా ఉన్న ఎల్‌కే అద్వానీ(LK Advani) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.

అనేక కీలక నిర్ణయాలు షా హయంలోనే..
కాగా అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) ప్రధానిగా ఉన్న సమయంలో అద్వానీ 2,256 రోజులపాటు కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఈ రికార్డును అమిత్ షా ఇప్పుడు అధిగమించారు. ఈ పరిణామం షా నాయకత్వ పటిమ, పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యతను మరోసారి నిరూపించింది. ఆయన హోంమంత్రిగా కొనసాగిన కాలంలో జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు(Article 370 repealed), పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటితో పాటు అంతర్గత భద్రత, ఉగ్రవాదం(Terrorism)పై పోరాటం, ఈశాన్య రాష్ట్రాల సమస్యల పరిష్కారం వంటి అనేక అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ భద్రత, అంతర్గత వ్యవహారాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి.
Congratulations Hon. HM Shri Amit Shah ji! pic.twitter.com/HaE0owDvwr
— Vijayalakshmi Aravind (@vijiBJP) August 6, 2025






