తెలంగాణ: ఈ నెల 27న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం టెట్ పరీక్ష నిర్వహించగా… పేపర్-1కు 2,26,744 మంది, పేపర్-2కు 1,89,963 మంది హాజరయ్యారు. ఈ నెల 19, 20 తేదీల్లో ప్రైమరీ కీ విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ కీపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది కీని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా సిరిసిల్లా జిల్లాలో ఓ సెంటర్లో ఓఎంఆర్ షీట్లపై అభ్యర్థులు వైట్నర్ ఉపయోగించగా వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని.. అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టం చేశారు. పలు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణలో జరిగిన తప్పిదాలపై అభ్యర్థులు మండిపడుతున్నారు.
Govt Jobs: గుడ్న్యూస్.. తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్…








