
కొందరికి తమ ఇష్ట దైవంతో పాటు అభిమాన నటీనటులు అంటే అమితమైన ఇష్టం, భక్తి కలిగిఉంటారు. మరికొందరు సినీ తారలనే దేవుళ్లుగా భావిస్తుంటారు. వారిపై అభిమానం ఒకానొక స్థాయిలో తారాస్థాయికి చేరి ఏకంగా వారికి ఆలయాలు కట్టించిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పటికే ఖుష్బూ, నమిత(Namitha), నిధి అగర్వాల్, మమతా కులకర్ణి, రజినీకాంత్(Rajinikanth) తదితరుల అభిమానులు వారికి ప్రత్యేక గుడి కట్టించారు. అలాగే మరో అభిమాని ఏపీ(Andhra Pradesh)లోని బాపట్ల జిల్లా ఆలపాడు(Aalapadu Village) గ్రామంలో సందీప్ అనే యువకుడు తనకు ఇష్టమైన నటి సమంత(Samantha) పేరిట మూడేళ్ల క్రితం గుడికట్టించాడు. వివరాల్లోకి వెళ్తే..
సమంత సేవా కార్యక్రమాలు నచ్చడంతో..
ఆలపాడుకు చెందిన సందీప్(Sandeep) అనే కార్ డ్రైవర్ సమంతకు వీరాభిమాని. ‘ఏంమాయ చేశావే’ సినిమా నుంచి ఆమెకు అభిమానిగా మారిపోయాడట. ప్రత్యూష ఫౌండేషన్(Pratyusha Foundation) ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు(Heart surgeries for children) చేయించడంలో సమంత చూపిన చొరవ, ఇతర సేవా కార్యక్రమాలు నచ్చడంతో ఆమె కోసం ఏదైనా చేయాలనుకున్నాడట. ఆ క్రమంలోనే తన ఇంటి ఆవరణలోనే 2023లో సమంత పుట్టినరోజు(Samanth Birthday) నాడు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆమె మంచితనం, సామాజిక సేవకు తాను ఫిదా అయ్యానని.. అందుకే ఆమెకు గుడి కట్టి పూజిస్తున్నానని సందీప్ చెబుతున్నాడు. ఏటా ఆమె పుట్టినరోజుకి పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేయడంతో పాటు అన్నదానం కూడా చేస్తున్నట్లు చెబుతున్నాడు. అలాగే ఈరోజు (ఏప్రిల్ 28) కూడా అనాథలతో కేక్ కట్ చేసి, వారికి అన్నదానం చేశాడు.
బాపట్లలో హీరోయిన్ సమంతకు గుడి కట్టిన అభిమాని సందీప్ pic.twitter.com/W8NHEXCBUC
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2025