అంతరిక్షం(The Space) అద్భుతాలతో నిండి ఉంటుంది. ప్రతి కొత్త అన్వేషణ(Innovations), కొత్త విషయాలు, రహస్యాలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. నక్షత్రాలు(Stars), గ్రహాలు, గెలాక్సీలు ఇవన్నీ విశ్వంలోని అద్భుతాలే. ఇక మరికొన్ని రోజుల్లో ఖగోళ అద్భుతం జరగనుంది. ఫిబ్రవరి 28, 2025న ఖగోళ ప్రేమికులు ఓ అరుదైన దృశ్యాన్ని చూడబోతున్నారు. అంతరిక్షంలో ఏడు గ్రహాల పరేడ్ (Seven-Planet Parade) అనే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.

2022లో ఐదు గ్రహాలు ఒకే వరుసలో..
ఈ రోజు నాడు సౌరమండలం(In the solar system)లోని ఏడు గ్రహాలు.. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, బుధ గ్రహాలన్నీ ఒకే లైన్(Same Line)లో దర్శనమివ్వనున్నాయి. భారత్, అమెరికా, మెక్సికో, కెనడా ప్రజలకు ఈ అద్భుతం కనువిందు చేయనుంది. ఈ వింతని టెలిస్కోప్(Telescope) లేకుండానే చూడొచ్చు. వీటిని భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళ రేఖపై ఉన్నట్లు కనపడతాయి. 2022లో ఐదు గ్రహాలు ఒకే వరుసలో కనిపించాయి. కానీ ఏడు గ్రహాలు ఇలా ఒకేసారి ఒకే రేఖలో కనిపించడం చాలా అరుదు.

టెలిస్కోప్‌తో ఈ గ్రహాలను మరింత స్పష్టంగా చూడొచ్చు..
అయితే ఇలాంటి గ్రహ సముదాయం(Planetary complex) ఒకే సరళ రేఖపై మళ్లీ 2040లోనే కనిపిస్తుంది. కాకపోతే ఐదు గ్రహాలే కనిపిస్తాయట. ఇలా ఏడు గ్రహాలు ఇలా కనిపించేందుకు మరికొన్ని దశాబ్దాలు పట్టొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు(Scientists). అందుకే ఈ అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. కొండలు లేదా బహిరంగ ప్రదేశాలు, తక్కువ కాంతి ఉండే ప్రాంతాల నుంచి వీటిని చూడొచ్చు. టెలిస్కోప్ ఉంటే ఈ గ్రహాలను మరింత స్పష్టంగా చూడటానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.






