
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty).. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. తాజాగా ఆయన ‘శబ్దం (shabdham)’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం, కెరీర్ గురించి మాట్లాడారు. తన భార్య నిక్కీ గల్రానీతో విడిపోతున్నట్లు వస్తున్న కథనాలపైనా ఆది స్పందించారు.
మేం ఫస్ట్ ఫ్రెండ్స్
‘‘నిక్కీ (Nikki Galrani) నేను ఫస్ట్ మంచి ఫ్రెండ్స్. ఆ తర్వాతే లవర్స్. ఇప్పుడు భార్యాభర్తలం, నా ఫ్యామిలీకి తనంటే చాలా ఇష్టం. తనకు కూడా నా ఫ్యామిలీ బాగా నచ్చింది. తనతో ఉంటే నేను చాలా హ్యాపిగా ఉంటాను. తను కూడా అలాగే ఫీల్ అయింది. అందుకే పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాం. చాలా హ్యాపీగా మా లైఫ్ లీడ్ చేస్తున్నాం.
చాలా కోపం వచ్చింది
అయితే మేం విడాకులు తీసుకుంటున్నాం అని యూట్యూబ్ లో కథనాలు వచ్చాయి. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి చాలా కోపం వచ్చింది. కానీ ఆ ఖాతాల్లో ఉన్న పాత వీడియోస్ చూశాక ఇవి పట్టించుకోకపోవడమే బెటర్ అనిపించింది. లైక్స్, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థం చేసుకున్నాను.” అని ఆది చెప్పుకొచ్చారు.
చిరు ప్రశంస మరిచిపోలేను
‘రంగస్థలం (Rangasthalam)’ మూవీతో తనకు తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చి పెట్టిందని ఆది పినిశెట్టి తెలిపారు. ఆ మూవీలో తాను చనిపోయినట్టు యాక్ట్ చేసిన సీన్ చూసి తన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘సరైనోడు (Sarainodu)’ లో విలన్‌గా నటించిన తన పాత్రకు గుర్తింపు ఇచ్చిందని వెల్లడించారు. ఆ సినిమా విడుదలయ్యాక చిరంజీవి ఫోన్ చేసి ప్రశంసించారని.. ఆ ప్రశంసలు తాను మరిచిపోలేరని చెప్పుకొచ్చారు ఆది.
ఫిబ్రవరి 28న రిలీజ్
ఇక ‘శబ్దం’ సినిమా సంగతికి వస్తే వైశాలి ఫేం అరివళగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘వైశాలి’ విజయం తర్వాత వీళ్ల కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. 7జి ఫిల్మ్స్ శివ నిర్మించగా .. సిమ్రాన్, లైలా (Laila), లక్ష్మీమేనన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 28వ తేదీన విడుదల కానుంది.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…