ManaEnadu: ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM)గా ఆతిశీ మర్లెనా (Atishi Marlena) ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(Lt. Governor VK Saxena) ఆమెతో సీఎంగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), తదితరులు హాజరయ్యారు. ఆతిశీతోపాటు గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్(Arrest) కావడం తెలిసిందే. కొన్ని నెలలు తిహార్ జైల్లో(Tihar jail) ఉన్న ఆయన ఇటీవల బెయిల్(Bail) మీద విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన వెంటనే CM పదవికి రాజీనామా చేశారు. అనంతరం తన వారసురాలిగా ఆతిశీని ప్రకటించారు. దీనికి పార్టీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి(FEB 2025)లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
2013లో ఆప్‌లోకి ఎంట్రీ
ఆతిశీ విషయానికి కొస్తే.. 1981, జూన్ 8న ఆమె జన్మించారు. ఆతిశీ తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిపతా వాహి ఇద్దరూ ఢిల్లీ యూనివర్సిటీ(University of Delhi)లో ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆమె తన పాఠశాల విద్యను న్యూ ఢిల్లీలోని స్రింగ్‌డేల్స్ స్కూల్‌లో పూర్తి చేసింది. 2001లో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, న్యూఢిల్లీ నుంచి చరిత్రలో పట్టభద్రురాలైంది. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ(Oxford University)లో చేరింది. అక్కడి నుంచి 2003లో చవెనింగ్ స్కాలర్ షిప్‌పై తన మొదటి మాస్టర్ డిగ్రీని పొందింది. 2013లో AAPలో ఆమె చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో క్రీయాశీలంగా వ్యవహరించారు. అవినీతికి వ్యతిరేకంగా ఆమె పోరాటాలు చేశారు. 2019లో ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి క్రికెటర్ గౌతమ్ గంభీర్(Cricketer Gautam Gambhir) చేతిలో ఓడిపోయారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ(Kalkaji) అసెంబ్లీలో పోటీ చేసి 11 వేల ఓట్లతో ప్రత్యర్థిపై గెలుపొందారు. తాజాగా CMగా ప్రమాణం చేశారు.
दिल्ली में नई सरकार गठन का शपथ ग्रहण कार्यक्रम। LIVE https://t.co/wsY3l5BTQ0
— Atishi (@AtishiAAP) September 21, 2024