Bigg Boss 8 Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే?

ManaEnadu:బిగ్‌బాస్‌ సీజన్‌-8 (Bigg Boss Telugu) అప్పుడే మూడో వారం ముగిసింది. ఈ వారం హౌస్ నుంచి ఊహించని కంటెస్టెంట్ బయటకు వెళ్లిపోయాడు. అతనెవరంటే..? అభయ్‌ నవీన్‌. తక్కువ ఓట్లు వచ్చిన అభయ్ ఎలిమినేట్‌ అయినట్లు హోస్టు నాగార్జున (Nagarjuna) ప్రకటించారు. ఈ సీజన్‌లో నవీన్‌ గట్టి పోటీ ఇస్తాడని భావించిన అభయ్ ఎలిమినేట్ అవ్వడంతో ఇప్పుడు నెట్టింట చర్చంతా ఇతడి గురించే జరుగుతోంది.

మరోవైపు అభయ్(abhai naveen) ఎలిమినేషన్​కు ముందు ఈ శనివారం ఎపిసోడ్​లో అభయ్​పై నాగ్ సీరియస్ అయ్యారు. నామినేషన్స్​లో సెల్ఫ్ నామినేట్ చేసుకున్న ఇతను.. ఎగ్స్‌ టాస్క్‌లో తన వంతు ప్రయత్నం చేయకుండా బిగ్‌బాస్‌పై అసహనం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా బిగ్​బాస్​పై, షోపై విమర్శలు చేశాడు. ‘తినడానికి టాస్క్‌లు పెడుతున్నారు. తినకుండా ఉండటానికి టాస్క్‌లు పెడుతున్నారు’ అసలు ఏం అవుతుందో ఆయనకే తెలియదు. ఏదో వాళ్లింట్లో పెళ్లాం కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నాడు. నువ్వసలు బిగ్ బాస్ కాదు బయాస్డ్ బాస్ అంటూ’ అంటూ షోపైనా ఘాటు కామెంట్స్ చేశాడు.

దీనిపై నాగార్జున స్పందిస్తూ బిగ్‌బాస్‌ మీద గౌరవం లేకపోతే, ఉపేక్షించనని.. బలవంతంగా రెడ్‌ కార్డు ఇస్తున్నానంటూ.. గెట్‌ అవుట్‌ ఆఫ్ ది హౌస్‌ అని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. అయితే ‘ఈ ఒక్కసారి క్షమించండి’ అని అభయ్‌ వేడుకోవడంతో పాటు హౌస్‌మేట్స్‌ అందరూ కలిసి నాగార్జున, బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్‌ చేయడంతో చివరకు క్షమించేశారు.

అయితే, శనివారం తప్పించుకున్నా ఆదివారం ఎలిమినేషన్‌ (Elimination) చివరిలో అభయ్‌, పృథ్వీలు మిగలగా, అభయ్‌కు తక్కువ ఓట్లు రావడంతో షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇక అభయ్ ఎలిమినేషన్ చూసిన నెటిజన్లు హౌస్‌మేట్స్‌ కాపాడినా, ప్రేక్షకులకు మాత్రం కరుణంచలేదని సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇక హౌజు నుంచి వేదికపైకి వచ్చిన అభయ్‌కు నాగార్జున ఒక సూచన చేశారు. ‘‘మనలో టాలెంట్‌ ఎంత ఉన్నా, మనల్ని ప్రేమించే ఆడియెన్స్‌ మన ప్రవర్తన చూసే ఓటు వేస్తారు’’ అని అన్నారు. హ్యూమర్‌ బోర్డర్‌ గురించి అందరికీ చెప్పి తాను క్రాస్‌ అయ్యానని అభయ్‌ వివరణ ఇచ్చి షో నుంచి వెళ్లిపోయాడు.

Share post:

లేటెస్ట్