నాగర్ కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దోమలపెంట వద్ద SLBC టన్నెల్ నిర్మాణంలో ప్రమాదం జరింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ 14KM వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ (SLBC Tunnel) పనుల్లో అపశ్రుతి చోటుచేసుకోవడంతో అంతా షాకయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులను గాయాలు కాగా రెస్య్కూ సిబ్బంది(Rescue Team) వారిని బయటి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాద సమయంలో టన్నెల్లో 50 కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
BIG BREAKING : Deadly SLBC Tunnel Mishap: Rushed Construction Turns Tragic!#Telangana: Major mishap at SLBC tunnel!
A massive 3-meter roof collapse at the 14th km mark leaves workers trapped, 3 seriously injured!CM Revanth Reddy Govt rushed construction just 4 days ago -… pic.twitter.com/Ks9yXgulBx
— TeluguScribe Now (@TeluguScribeNow) February 22, 2025
ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ ఆరా
ఇదిలా ఉండగా టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్(CM Revanth) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్దపై కప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్. SP, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy). ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్(Special helicopter)లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.
Chief Minister @revanth_anumula on the accident that happened near SLBC tunnel. Revanth Reddy expressed shock. Chief Minister alerted the authorities immediately after the information that many people were injured due to the overhead laborer near the tunnel. CM has ordered…
— Nawab Abrar (@nawababrar131) February 22, 2025






