MEGA 157 : చిరు-అనిల్ సినిమాలో విలన్ గా యంగ్ హీరో?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగు దాదాపుగా పూర్తయింది. ఇక ఈ చిత్రం తర్వాత చిరు హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమం కూడా జరిగింది. అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్నారు.

Image

మెగా-అనిల్ లేటెస్ట్ న్యూస్

మరోవైపు ఈ మూవీలో మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కామియో రోల్ లో నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో కలిసి వెంకీ ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం అనే బ్లాక్ బస్టర్ మూవీ చేశారు. ఇప్పుడు వెంకీతో చిరు మూవీలో కామియో చేయిస్తే ప్రేక్షకులు థ్రిల్ అవుతారని అనిల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగు కూడా ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే..?

Image

చిరుతో యంగ్ హీరో ఫైట్

చిరు-అనిల్ రావిపూడి సినిమాలో విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించి తన సత్తా చాటిన నటుడు ఈ సినిమాలో చిరుతో ఫైట్ చేయబోతున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..? ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తికేయ (Actor Karthikeya). కార్తికేయ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్, అజిత్ వాలిమై సినిమాలో విలన్ గా అదరగొట్టాడు.

మెగాస్టార్ తో యంగ్ హీరో ఢీ

ఇక ఇప్పుడు మెగాస్టార్ తో ఢీ కొట్టేందుకు రెడీ అయ్యాడు కార్తికేయ. ఈ యంగ్ హీరో చిరంజీవికి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో చిరుతో కలిసి పని చేయాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు అనిల్ రావిపూడి (Chiru Anil Film) రూపంలో ఇప్పుడు ఈ హీరోకు ఆ అవకాశం దక్కినట్లు సమాచారం. అయితే కార్తికేయ పాత్రకు సంబంధించి చిత్రబృందం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే భవిష్యత్తులో మరిన్ని ప్రతినాయక పాత్రలు కార్తికేయ కోసం క్యూ కట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Related Posts

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Ram Pothineni: రామ్ కొత్త మూవీ గ్లిమ్స్ వచ్చేసింది.. మూవీ పేరు ఇదే..

రామ్ పోతినేతి (Ram Pothineni), భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబోలో మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన సూపర్ అప్డేట్ వచ్చేసింది. రామ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ (Andhra King…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *