
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సెట్ లో కొంత భాగం షూటింగ్ జరిగింది. ఇక ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం మహేశ్ బాబు ఒడిశాకు వెళ్లారు. ఆయనతో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒడిశా షెడ్యూల్ లో పాల్గొన్నారు.
SSMB29 ఫొటోలు లీక్
అయితే ఒడిశాలో SSMB29 సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ రూపొందించారు. ఈ సెట్ కు సంబంధించిన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి వార్తలు, ఫొటోలు (SSMB29 Photos Leak), వీడియోలు లీక్ కాకుండా జక్కన్న చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినా లీకులు తప్పడం లేదు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో లీక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు పేరు ఇదేనంటూ ఓ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
SSMB29లో మహేశ్ పేరు లీక్
SSMB29 చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర (RUDRA)’ అనే పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమా విషయాలేం లీక్ కాకుండా పక్కా ప్లాన్ తో ఉన్న రాజమౌళి ఇప్పుడు ఫొటోలు, హీరో పాత్ర పేరు లీక్ కావడంతో ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండనున్నట్లు తెలిసింది. ఇప్పుడు లీకైన పేరు నిజమో కాదో కూడా తెలియదు. ఒకవేళ అదే నిజమైతే జక్కన్న ఆ పేరును మార్చినా మార్చే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో జక్కన్న చెప్పే వరకు వేచి చూడాల్సిందే.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…