నాగ చైతన్య – శోభిత పెళ్లిపనులు ప్రారంభం

Mana Enadu:టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థ ఇటీవలే హైదరాబాద్​లో జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్​కు సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో పోస్టు చేసి ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పెళ్లి ఎప్పుడో మాత్రం అప్పుడు చెప్పలేదు. అయితే తాజాగా ఈ జంట పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.

చై- శోభిత పెళ్లి పనులు షురూ

పసుపు దంచుతున్న ఫొటోలను శోభితా తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. పెళ్లి ఎక్కడ అని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. విదేశాల్లో గ్రాండ్​గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా లేదా ఇండియాలోనే చేసుకుంటారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపుగా వీరి వివాహం హైదరాబాద్​లోనే ఘనంగా జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు వీరి వివాహ తేదీ కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

అనంతమైన ప్రేమకు నాంది

ఇక నాగ చైతన్య- శోభితా నిశ్చితార్థం 2024 ఆగస్టులో హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలను చైతూ ఫాదర్ కింగ్​ నాగార్జున సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వారి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటూ 8.8.8 (08-08-2024) అనంతమైన ప్రేమకు నాంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో వీరి పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించగా.. ఇప్పుడేమో పెళ్లి పనులు ప్రారంభం కావడంతో ఆ తేదీ మరింత ముందుగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే తండేల్​తో

ఇక నాగచైతన్య సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం అతడు ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సముద్రం బ్యాక్​డ్రాప్​లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చైతూకు జోడీగా లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్​గా నటిస్తోంది. మరోవైపు శోభితా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో పలు సినిమాల్లో నటిస్తోంది.

Share post:

లేటెస్ట్