The Paradise : గజరాజు నడిస్తే గజ్జికుక్కలు అరుస్తాయ్.. నాని టీమ్ స్ట్రాంగ్ కౌంటర్

నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో కలిసి ‘దసరా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీకాంత్ నానిని ఊర మాస్ అవతార్ లో చూపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ హిట్ కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. వీరిద్దరి కాంబోలో ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) వస్తున్న  విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాపై రూమర్స్‌ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

రూమర్స్ పై స్ట్రాంగ్ కౌంటర్

ఇటీవల ది ప్యారడైజ్ గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్ పై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో వాడిన భాష, విజువల్స్, నాని (Nani)  పాత్ర విషయంలో ట్రోల్స్ వచ్చాయి. ఇక తాజాగా ఈ సినిమాపై కొన్ని పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ స్క్రిప్ట్‌ విషయంలో నాని ఆసక్తిగా లేరని కొందరు అంటుంటే.. బడ్జెట్‌ కూడా ఎక్కువ కావడంతో సినిమా ఆగిపోయిందంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ రూమర్స్ పై టీమ్‌ ఘాటూగా స్పందిస్తూ ఓ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

గజరాజు నడుస్తుంటే గజ్జికుక్కలు అరుస్తాయ్

‘‘ది ప్యారడైజ్‌’ సినిమా పనులు అనుకున్నవిధంగా జెట్ స్పీడులో సాగుతున్నాయి. ఈ సినిమాను  ఎంత గొప్పగా తీస్తున్నామో త్వరలోనే అందరూ చూస్తారు.  అప్పటివరకూ మీరంతా ఇలాంటి రూమర్స్ క్రియేట్‌ చేస్తూ బతికేయండి. ఎందుకంటే గజరాజు నడుస్తుంటే గజ్జికుక్కలు అరుస్తుంటాయి కదా! మేము ఈ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను..  దీనిపై వస్తున్న పుకార్లను గమనిస్తున్నాం. వీటిన్నిటితో ఓ శక్తి ఎదిగి టాలీవుడ్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచేలా ‘ది ప్యారడైజ్‌’ సినిమాను తీర్చిదిద్దుతాం. అభిమానులంతా గర్వపడే చిత్రంతో నాని మీ ముందుకువస్తారని మాటిస్తున్నాం’’ అంటూ పారడైజ్ టీమ్ పోస్టు పెట్టింది.

మార్చి 26న గ్రాండ్ రిలీజ్

‘ది ప్యారడైజ్‌’ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి ‘‘రా స్టేట్‌మెంట్‌’’ పేరుతో ఇటీవలే ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది.  రెండు జళ్లతో రా రస్టిక్‌ లుక్‌లో నాని అదరగొట్టాడు. తిరుగుబాటు, నాయకత్వంతో పాటు తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక ఇది పాన్ ఇండియా భాషల్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతోనే కాకుండా ఇంగ్లిష్, స్పానిష్‌ లాంటి విదేశీ భాషల్లోనూ విడుదల కానుంది. వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Prabhas : ‘ది రాజాసాబ్’ హై అలర్ట్.. మేలో అదిరిపోయే సర్ ప్రైజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మూవీ తర్వాత ఓకే చేసిన ఫస్ట్ సినిమా ‘ది రాజాసాబ్ (The Raja Saab)’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపుగా పూర్తైంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ అకస్మాత్తుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *