బలగం వేణు ‘ఎల్లమ్మ’కు హీరో దొరికేశాడు?

Mana Enadu : కమెడియన్ వేణు యెల్దండి(Venu Yeldandi).. ‘బలగం’ సినిమాతో సూపర్ గా పాపులర్ అయ్యాడు. బలగం సినిమాతో పల్లె జీవితం.. పల్లెలో బంధాలు, ఆత్మీయతను కళ్లకు కట్టినట్టు చూపించాడు. తన సినిమాలో రియాల్టీని చూపించడంలో వంద శాతం సక్సెస్ అయ్యాడు. అందుకే తీసిన మొదటి సినిమానే ఇంటి పేరుగా మారిపోయింది. ‘బలగం(Balagam)’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే గాక.. ఎన్నో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత వేణు నుంచి తర్వాత సినిమా ఏం వస్తుందోనని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎల్లమ్మ హీరో అతడే

దర్శకుడిగా, కథా రచయితగా వేణుపై ఎంతో నమ్మకం కలిగి ఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) దర్శకుడి తదుపరి సినిమాను తీసేందుకు ముందుకు వచ్చారు. ఎల్లమ్మ పేరుతో రానున్న ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనుంది. ఈ కథను వేణు ఇప్పటికే నేచురల్ స్టార్ నాని, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) కు వినిపించాడు. ఈ ఇద్దరికీ కథ నచ్చినా.. ఇప్పటికే ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా చేయలేకపోతున్నట్లు తెలిసింది. అయితే ఈ కథ ఇప్పుడు మరో యంగ్ హీరో నితిన్ వద్దకు వెళ్లిందట.

దిల్ రాజు బ్యానర్ లో ఎల్లమ్మ

ఈ కథ విన్న వెంటనే నితిన్(Nithin) ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. లవ్‌, యాక్షన్‌ కథలతో అలరించిన నితిన్‌కు ఇది కొత్త జానర్‌గా అనిపించింది అంట. అందుకే వెంటనే ఓకే చెప్పేశాడట. ‘ఎల్లమ్మ(Yellamma Movie)’ సినిమా.. రంగస్థల కళాకారుల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. దిల్‌రాజు బ్యానర్‌లో  రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికార ప్రకటన త్వరలో రానుంది. ఇదే నిజమైతే.. తొలి సినిమా ‘దిల్‌’ తర్వాత నితిన్‌తో దిల్‌రాజు చేస్తున్న సినిమా ఇదే కానుంది.

Share post:

లేటెస్ట్