
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన ‘లైలా (Laila)’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా అనే ట్రెండ్ మొదలైంది. దీంతో చిత్రబృందం దిగొచ్చి పృథ్వీ (Prudhvi Raj) వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, తమ సినిమా చంపేయొద్దంటూ విజ్ఞప్తి చేసింది. అయినా ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
దిగొచ్చిన పృథ్వీ
ఈ క్రమంలో ఎట్టకేలకు పృథ్వీరాజ్ దిగొచ్చి ఈ విషయంలో క్షమాపణలు చెప్పారు. లైలా సినిమా వేడుకలో తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించమని కోరారు. వ్యక్తిగతంగా ఎవరిపై తనకు ద్వేషం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు క్షమాపణలు కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా (Laila Movie Release Date) అనాలని.. ఫలక్ నామాదాస్ కంటే లైలా పెద్ద హిట్ కావాలి అని ఆయన ఆకాంక్షించారు.
Rey….😡 #prudhvi chustu undu ninnu am cheyalo Maku telusu koncham #laila movie taruvata concentration chestam Ninnu wait cheyi 2 days rest tiskoo….👍
Guys inka start cheyandi kodita na kodukulu patalaniki povali💪#BoycotLaila#DisasterLailaMovie#diaasterlaila#YSRCPSM pic.twitter.com/Z2gpl0pN0O
— Palnadu Warriors (@lucky_ysrcp) February 13, 2025
పృథ్వీ మేకల కామెంట్స్
లైలా ప్రిరిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ (Prudhvi Raj Comments) మాట్లాడుతూ తన సీన్స్ షూటింగ్ గురించి చెప్పారు. ఈ క్రమంలో తాను ఈ సినిమాలో మేకల సత్తి అనే క్యారెక్టర్ చేశానని.. మూవీ ప్రారంభమైనప్పుడు మొత్తం తన వద్ద 150 మేకలు ఉండేవని.. పూర్తయ్యే సమయానికి అవి 11 మేకలయ్యాయయని వ్యాఖ్యానించారు. ఇది యాదృచ్ఛికమే లేక కాకతాళీయమో ఏమో తెలియదంటూ ఏపీలోని వైఎస్సార్సీపీ (YSRCP) పార్టీని ఉద్దేశించి కామెంట్స్ చేయడం వివాదానికి దారి తీసింది.