తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఎక్కువసేపు స్క్రీన్ మీద కనిపించకపోయినా.. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంది. అలాంటి వారిలో ఒకరు నటి అపూర్వ( Actress Apoorva). పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామానికి చెందిన అపూర్వ(Apoorva), అల్లరి(Allari) సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలో ఆమె వయసు తక్కువైనా కూడా హీరో అల్లరి నరేష్(Allari Naresh)కు తల్లి పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె నటనతో పాటు అందం కూడా ప్రేక్షకులను మెప్పించింది.
సినిమాల పరంగా చూస్తే ‘రెడీ’, ‘సీమటపాకాయ్’, ‘అఖిల్’, ‘డేంజర్’, ‘హరే రామ్’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించింది. క్యారెక్టర్ రోల్స్ మాత్రమే కాకుండా, కొన్ని వ్యాంప్ పాత్రలలోనూ కనిపించింది. ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెలుగొందిన అపూర్వ, ప్రస్తుతం సినిమాలను తగ్గించింది. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ ఉన్న, ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఆమె తాజా లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఇప్పటికీ తానేమీ మారలేదని, తన అందం కూడా అలానే ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అపూర్వ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ వైపు నటనతో, మరోవైపు ఫ్యాషన్ లుక్‌తో ఈ బ్యూటీ తనదైన ముద్ర వేసుకుంటూనే ఉంది. నెటిజన్లు గూగుల్‌లో ‘అపూర్వ ఇప్పుడు ఎలా ఉందో’ అని వెతుకుతున్నారంటే ఆమె క్రేజ్ మిగిలే ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది.
View this post on Instagram






