సినీ, టీవీ రంగాల్లో విశేషమైన గుర్తింపు సంపాదించిన ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల జూలై 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారనే వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట ఇది సాధారణ జ్వరమని భావించినా, వైద్య పరీక్షల అనంతరం ఆమెకు డెంగ్యూ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలుస్తోంది.
ప్రస్తుతం రాధికకు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. వైద్యుల సూచన మేరకు ఆమె పూర్తిగా కోలుకునే వరకూ ఆసుపత్రిలోనే ఉండనున్నారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు తెలిసింది. ఆసుపత్రిలో చేరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో, ఒక్కసారిగా సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ వార్తపై స్పందించిన సినీ ప్రముఖులు, అభిమానులు #GetWellSoonRaadhika అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
டெங்கு காய்ச்சல் காரணமாக நடிகை ராதிகா சரத்குமார் மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டுள்ளார். இரு நாட்களுக்கு முன்பு மருத்துவமனையில் அனுமதிக்கப்பட்ட அவர், மேலும் 5 நாட்கள் சிகிச்சை பெற்ற பின் இல்லம் திரும்புவார் என்று மருத்துவர்கள் தெரிவித்துள்ளனர். #RadhikaSarathkumar #BJP #Dengue pic.twitter.com/UlAqSXjnfP
— Idam valam (@Idam_valam) July 31, 2025






