అలాంటి వాళ్లను నేను పట్టించుకోను.. కొండా సురేఖ కామెంట్స్ పై సమంత

Mana Enadu : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై సమంత సహా సినీ, రాజకీయ ప్రముఖులు ఘాటుగా స్పందించారు. అప్పట్లో ఈ వ్యవహారం పెను దుమారానికి దారి తీసింది. చివరకు మంత్రి స్వయంగా సమంత(Samantha)కు క్షమాపణలు కూడా చెప్పారు.

కొండా సురేఖ వివాదంపై సామ్ రియాక్షన్

అయితే సమంత ప్రస్తుతం ‘సిటడెల్(Citadel)’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా సురేఖ వివాదంపై మరోసారి స్పందించింది. ఎంతోమంది మద్దతుతో తాను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగానని.. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు తనపై ఉన్న నమ్మకం,  తనపై చూపించే ప్రేమే తనను ఈ స్థాయిలో నిలబెట్టాయని చెప్పుకొచ్చింది.

వాళ్లు నాకు అండగా నిలిచారు

కష్టాలను ఎదుర్కోవడంతో వారి మద్దతు తనకు ఎంతో ఉపయోగపడిందని సమంత తెలిపింది. వారంతా తన వెంట నిలబడకపోయుంటే కొన్ని పరిస్థితులను అధిగమించేందుకు చాలా సమయం పట్టేదని స్పష్టం చేసింది. తన చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోగలిగానని సమంత ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

వాళ్లను నేను పట్టించుకోను 

మరోవైపు ట్రోలింగ్స్​పై(Samantha Trolls)నా స్పందిస్తూ.. అలాంటి వాటి గురించి తాను ఎక్కువగా ఆలోచించనని చెప్పింది. ద్వేషపూరిత సందేశాలు స్వీకరించినప్పుడు వాటి ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానని తెలిపింది. అలాంటి మెసెజ్​లు పంపేవారు కూడా అలాంటి బాధే అనుభవించారేమో అని ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది.

ఇక సిటడెల్- హనీ బన్నీ (Citadel Honey Bunny) వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఇందులో సమంత, బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్​ ధావన్ కలిసి నటిస్తున్నారు. అమెజాన్​ ప్రైమ్​ వేదికగా నవంబర్‌ 7వ తేదీ నుంచి ఈ వెబ్​ సిరీస్‌  స్ట్రీమింగ్​ కానుంది. ఈ సిరీస్ ను ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫేం రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు.

Share post:

లేటెస్ట్