
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బింబిసార ఫేం వశిష్ఠతో కలిసి ‘విశ్వంభర (Vishwambhara)’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఓవైపు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ.. మరోవైపు సీజీ వర్క్స్ స్పీడప్ చేస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కోలీవుడ్ భామ త్రిష (Trisha) నటిస్తోంది. మీనాక్షి చౌదరి, అషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నాడు.
యమా స్పీడులో చిరు-అనిల్ మూవీ
ఇక విశ్వంభర తర్వాత చిరు రెండు సినిమాలు లైనప్ లో పెట్టాడు. అందులో ఒకటి శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో చేస్తుండగా మరొకటి అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో చేస్తున్నాడు. అయితే విశ్వంభర తర్వాత చిరు అనిల్ ప్రాజెక్టులో నటించనున్నాడు. ఆ తర్వాతే శ్రీకాంత్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం. అయితే చిరు.. తన సినిమా సెట్ లో అడుగుపెట్టబోయే ముందే అనిల్ స్క్రిప్టు, ఇతర పనులన్నీ చకచకా పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పటికే సినిమా ఫస్టాఫ్ స్క్రిప్టు అంతా క్లీన్ గా రెడీ చేసుకుని.. ప్రస్తుతం సెకండాఫ్ స్క్రిప్టు రాసుకునే పనిలో ఉన్నాడట.
View this post on Instagram
చిరు సినిమాలో బాలీవుడ్ భామ
అయితే తాజాగా చిరు-అనిల్ సినిమా గురించి నెట్టింట ఓ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఈమే అంటూ ఓ వార్త బాగా చక్కర్లు కొడుతోంది. మెగా-అనిల్ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ అదితీ రావు హైదరీ (Aditi Rao Hydari) నటించనున్నట్లు తెలిసింది. మేకర్స్ ఆ భామను ఈ సినిమా కోసం సంప్రదించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అదితీ ఇప్పటికే తెలుగులో అంతరిక్షం, వి, సమ్మోహనం, హే సినిమాకి, మహాసముద్రం వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.