Komaram Bheem: ఆదివాసీల ఉద్యమ గర్జన ‘కొమరం భీమ్’

Mana Enadu: భీమా..! నినుగన్న నేల తల్లి, ఊపిరిబోస్కున్న సెట్టూసేమా, పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, ఇనబడుతుందా..??

కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే. మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ
కొమురం భీముడో. కొమురం భీముడో
రగరాగా సూరీడై రగలాలి కొడుకో
రగలాలి కొడుకో..
అంటూ గోండు బెబ్బులి కొమరం భీమ్‌(Gond Bebbuli Komaram Bheem)పై పాటలో ఎంతో చక్కగా వివరించారు. గిరిజనుల(Tribals) కోసం దండుకట్టి పోరుబాట సాగించిన ఆదివాసీ విప్లవ వీరుడు కొమరం భీమ్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడ పీడన ఉంటుందో అక్కడే సేచ్ఛా-హక్కుల కోసం గొంతుక లేస్తుంది, ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడే తిరుగుబాటు మొదలవుతుందంటూ.. జల్, జంగల్, జమీన్(Jal, Jungle, Zameen) నినాదంతో నిజాం సర్కారు(Nizam’s government)పై భీకరంగా పోరాడిన గోండు బెబ్బులి కొమరం భీమ్ జయంతి నేడు.

 భీమ్ రగిల్చిన పోరాటం ప్రభుత్వంలో కదలిక

1901, అక్టోబర్ 22న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్(Asifabad) తాలూకాలోని సంకేపల్లి(Sankepalli) అనే ఏజెన్సీ గ్రామంలో గిరిజన గోండు తెగకు చెందిన దంపతులకు కొమరం భీమ్ జన్మించాడు. భీమ్ తండ్రి పేరు కొమరం చిన్నూ, తల్లి పేరు సోంబారు. ఆసిఫాబాద్(D)లోని ఆదివాసీలను పీడిస్తున్న నిజాం సర్కార్‌కు ఎదురొడ్డి నిలబడ్డాడు. గెరిల్లా(Guerrilla) తరహా పోరాటాలకు ఆదివాసీలను సిద్ధం చేసి నిజాంకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఆయన రగిల్చిన పోరాటం ప్రభుత్వంలో కదలిక తెచ్చింది. అడవి బిడ్డలకు ప్రత్యేక హక్కులు కల్పించింది.

 అల్లూరి పోరాటాలతో స్ఫూర్తి

మన్యం దొర అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama raju) పోరాటాలతో స్ఫూర్తి పొందిన భీమ్.. తమ బతుకులు మారాలంటే తమ ప్రాంతంలో పాలన తమదే అయి ఉండాలని భావించేవాడు. అందుకోసం నిజాం సర్కారుపై తిరుగుబాటు చేశాడు. రోజురోజుకు భీమ్ ప్రభావం జనాల్లో ఎక్కువవడంతో అతడిని మట్టుబెట్టాలని నిజాం ప్రభుత్వం పథక రచన చేసింది. అతని వద్ద సన్నిహితంగా మెలిగే కుర్దు పటేల్ సహాయంతో నిజాం ఆర్మీ(Nizam’s Army) జోడెఘాట్ ప్రాంతంలో కొమరం భీమ్‌పై తూటాల వర్షం కురిపించింది. దీంతో 39 ఏళ్లకే 1940లో కొమరం భీమ్ నేలరాలాడు.

 

Share post:

లేటెస్ట్