ఏపీ ప్రభుత్వం (Ap Govt) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సర్కార్ నౌకరీ కోసం దరఖాస్తు చేసుకునే వారికి తీపికబురు అందించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేందుకు అభ్యర్థులకు వయోపరిమితిని (Age Limit) పెంచుతూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. ప్రస్తుతం ఉన్న వయోపరిమితి కంటే యూనిఫామ్ ఉద్యోగాలకు రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
థాంక్యూ చంద్రబాబు
నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోపు జరిగే నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాలోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.








