
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajit Kumar), అందాల భామ త్రిష(Trisha) హీరోయిన్ జంటగా ఇటీవల వచ్చిన మూవీ “గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly)”. డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం గత నెల 10న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘పుష్ప 2’ విజయం తర్వాత మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ సినిమా ఇది. అజిత్ ఈ చిత్రంలో AKగా, రెడ్ డ్రాగన్‌గా రెండు భిన్న కోణాలున్న పాత్రల్లో స్టైలిష్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నా.. 240 కోట్లకు పైగా కలెక్షన్లు(Collections) దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్(OTT Streaming)కి సిద్ధమైంది.
రిలీజైన 4 వారాల్లోనే OTTలోకి..
ఫ్యాన్స్‌కి ఒక ఫ్యాన్ ట్రీట్ సినిమాలా వచ్చిన ఈ చిత్రం అజిత్ కెరీర్లో భారీ హిట్ అయ్యింది. అజిత్, త్రిష నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ నెల 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆ రోజు నుంచే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి ఉండనుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ థియేటర్లలో రిలీజైన 4 వారాల్లోనే OTTలోకి రానుండటంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.