
పుష్ప-2 గ్రాండ్ సక్సెస్‌తో ప్రజెంట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun). బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 1850కి పైగా వసూళ్లు రాబట్టి భారతీయ సినీ ఇండస్ట్రీలో తనదైన రికార్డు సెట్ చేసింది. ఇక ఇదే ఊపులో బన్నీ మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Director Atlee)తో బన్నీ జట్టుకట్టనున్నట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు(Pre Production Works) జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీలో గురించి మరో న్యూస్ బయటికొచ్చింది.
క్రేజీ కాంబోలో ఐదురుగు హీరోయిన్లు
అట్లీ-అల్లు అర్జున్ కాంబో(Atlee-Allu Arjun combo)లో రాబోతున్న మూవీకి సంబంధించి రోజుకో వార్త వినిపిస్తోంది. ఇటీవల బన్నీ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్టుగా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆయన కోలీవుడ్ హీరో అని ప్రచారం జరిగింది. కానీ ఆ హీరో ఎవరనే విషయం బయటికి రాలేదు. కానీ తాజాగా ఆ విషయం కూడా తెలిసిపోయిందని టీటౌన్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఇద్దరూ ఇద్దరే..
తాజాగా మరో న్యూస్ బయటికొచ్చింది. కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan)ను ఇటీవల అట్లీ కలిసి స్టోరీ వినిపించగా అందుకు శివ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కోలీవుడ్(Kollywood)లో పాటు ఇటు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్‌ను బన్నీ మూవీలో నటిస్తే మూవీ బంపర్ హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. కాగా జవాన్(Jawan)తో అట్లీ వెయ్యి కోట్లు కొల్లగొట్టగా, పుష్ప-2తో అల్లు అర్జున్ ఏకంగా రూ. 1850కిపైగా కోట్లు రాబట్టాడు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.