
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు(Celebrities in the film Industry) ఏం చేసినా స్పెషలే. అందులోనూ పలువురు తమ నటనతోపాటు పలు ఆశ్చర్యకర విషయాలతో అభిమానుల్లో నిత్యం మెదులుతూనే ఉంటారు. అయితే నటీనటుల ఆస్తుల వివరాలు(Asset details of actors) మాత్రం బయటకు రావు.. ఎందుకంటే ఆ విషయాలు తెలిస్తే ప్రేక్షకులు షాక్ అవ్వక తప్పదు. మామూలుగా ఇలాంటి వివరాలు పెద్దగా బయటికి రావు కానీ కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలు చేసే సర్వేల వల్ల బయటికి రాక తప్పదు. తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)కు సంబంధించిన ఫైనాన్షియల్ వివరాలు కూడా అలాగే బయటికొచ్చాయి.
అత్యధిక సంపాదన ఉన్న సెలబ్రిటీగా రికార్డు
ఇంతకీ విషయం ఏంటంటే.. 2024-25లో అమితాబ్ ఎన్ని కోట్లు సంపాదించారు? దాంట్లో ఎన్ని కోట్లు ట్యాక్స్(Tax) కట్టారు? అనే వివరాలను ఓ ప్రముఖ మ్యాగజైన్ ప్రచురించింది. అందులో ఉన్న సంఖ్యలు చూసి B-టౌన్ ప్రేక్షకులు షాక్ అవ్వక తప్పడం లేదు. ఒక్క ఏడాదిలోనే అమితాబ్ ఏకంగా రూ.120 కోట్ల ట్యాక్స్ కట్టారని సమాచారం. అంతేకాదు సినీ పరిశ్రమలో అత్యధిక సంపాదన ఉన్న సెలబ్రిటీ కూడా ఆయనే. అమితాబ్ బచ్చన్‌కు ప్రస్తుతం 82 ఏళ్లు. అయినా బ్రాండ్ ప్రమోషన్స్(Brand promotions), సినిమాలు, బుల్లితెర ప్రోగ్రామ్స్, కౌన్ బనేగా కరోడ్ పతీ.. ఇలా అన్నింటిలో అమితాబ్ డామినేషన్ ఇప్పటికీ కనిపిస్తుంది. అందుకే ఒక్క ఏడాదిలోనే అత్యధిక సంపాదనతో పాటు అత్యధిక ట్యాక్స్ కట్టిన బాలీవుడ్ ఆర్టిస్ట్‌గా అమితాబ్ రికార్డు సృష్టించారు.
82 ఏళ్లైనా కుర్ర హీరోలు పోటీ
ఇక 2025లో కూడా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పలు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొన్నాళ్ల క్రితం అమితాబ్ ఆస్తుల విలువ(Assets Value) రూ.270 కోట్లకు పైనే ఉంటుందని కూడా బీ టౌన్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో పాటు ఆయన వద్ద రూ.54.77 కోట్ల విలువ చేసే బంగారం కూడా ఉందట. రూ.17.66 కోట్ల విలువ చేసే వాహనాలు కూడా ఆయన పేరుపైనే ఉన్నాయని సమాచారం. అమితాబ్ 82 ఏళ్ల వయసులో రూ.350 కోట్లు సంపాదించి కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ మరీ సంపాదనలో దూసుకుపోతున్నారు.
View this post on Instagram