Mana Enadu : ప్రదీప్ మాచిరాజు (pradeep Machiraju).. టీవీ చూసే ప్రతి ఒక్కరికి ఈ పేరు సుపరిచతమే. ఒకప్పుడు ఏ ఛానెల్ చూసినా ఇతడే కనిపించేవాడు. అత్తాకోడళ్లతో సరదాగా ఆటాడించే ప్రోగ్రామ్ నుంచి కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను అంటూ సెలబ్రిటీ టాక్ షో వరకు అన్ని రకాల కార్యక్రమాలతో అలరించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు.. అవార్డు ఫంక్షన్స్.. ఇలా యాంకర్ గా, హోస్టుగా ఫిల్ బిజీ. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఫేమస్ మేల్ యాంకర్ గా ప్రదీప్ గుర్తింపు పొందాడు.
ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టినా నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. ఇక 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇక ప్రదీప్ చాలా బిజీ అయిపోతాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చాలా రోజుల తర్వాత ప్రదీప్ తన రెండో సినిమాను ప్రకటించాడు.
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi)’ అనే టైటిల్ తో ప్రదీప్ మాచిరాజ్ తన సెకండ్ సినిమాను ప్రకటించాడు. ఈ సందర్భంగా ఈ సినిమాఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో హీరోహీరోయిన్లు ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రదీప్ కు జోడీగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ దీపిక పిల్లి(Deepika Pilli) నటిస్తోంది.
ఇక ఈ వీడియోలో ఓ వైపు అందమైన ఊరు, మరోవైపు ఆయుధాలు చేత బట్టిన గ్రామస్థులు, క్లాస్ రూంలో ప్రదీప్, ఇంట్లో హీరోయిన్ కనిపిస్తున్న విజువల్స్‌తో కట్ చేసిన మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ మూవీ ప్రేమ కథ నేపథ్యంలో ఉండబోతుందని తెలిసిపోతోంది. మోంక్స్ అండ్ మంకీస్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానిక ఈఏ రాధన్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ – భరత్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.






