
తెలుగులో ఏకైక ఓటీటీ ఆహా (AHA) మరో ఇంట్రెస్టింగ్ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఇప్పటికే ఈ ఓటీటీలో పలు రకాల కుకింగ్ షోలు చేసిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి, నిహారిక హోస్టులుగా సెలబ్రిటీలతో వేర్వేరు సీజన్లలో కుకింగ్ షో చేశారు. వాటికి మంచి స్పందనే వచ్చింది. ఇక ఇప్పుడు మరో సీజన్ ను సరికొత్తగా తీసుకొచ్చేందుకు ఆహా ప్లాన్ చేసింది. అయితే ఈసారి స్టార్ యాంకర్ సుమ కనకాల (Suma Kanakala)తో ఈ షో ప్లాన్ చేసింది ఆహా.
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K
సుమ కనకాల హోస్టుగా రాబోతున్న “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K (Chef Mantra Project K)” షో నుంచి తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. ఈ షో ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. చెఫ్ మంత్ర వరకు ఓకే కానీ ఈ ప్రాజెక్ట్ K అంటే ఏంటి? అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. అయితే కొందరు నెటిజన్లు ప్రాజెక్టు కె అంటే ప్రాజెక్టు కనకాల అంటున్నారు. ఇక ఈ షోలో చెఫ్, నటుడు జీవన్ కుమార్ జడ్జిగా వ్యవహరించారు. ఆహా రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు నవ్వులు పంచుతోంది.
10 మంది కంటెస్టెంట్స్..
ఇక ఈ షోలో అమర్ దీప్ (Amardeep) – అర్జున్ (Arjun), దీపికా రంగరాజు – సమీరా భరద్వాజ్, సుప్రిత – యాదమ్మ రాజు, ప్రషు – ధరణి, విష్ణుప్రియ – పృథ్వీ జోడీలు తమ వంటలతో పాటు కామెడీతో పసందైన వినోదం వడ్డించనున్నారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రా వంటలు మాత్రమే కాకుండా, వెరైటీ వంటకాలు కూడా సెలబ్రిటీ జంటలు చేయాల్సి ఉంటుందని ప్రోమో చూస్తే తెలుస్తోంది. 10 మంది కంటెస్టెంట్స్ పరిచయం చేసే వంటకాలు ప్రేక్షకుల కడుపు నింపుతాయని.. అలాగే కడుపుబ్బా నవ్వులు మాత్రం పంచుతాయని అంటున్నారు మేకర్స్.