రోషన్ కనకాల(Roshan Kanakala) నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’ గ్లింప్స్(Mowgli Glimpse) విడుదలై సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఒక ప్రేమ కథగా రూపొందుతోంది. రాజీవ్ కనకాల(Rajiv Kanakala), సుమ కనకాల(Suma Kanakala) కుమారుడైన రోషన్, తన తొలి చిత్రం ‘బబుల్‌గమ్(Bubblegum)’తో హీరోగా పరిచయమై, నటనా ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ‘మోగ్లీ’తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ‘మోగ్లీ’ గ్లింప్స్‌ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయగా, నేచురల్ స్టార్ నాని(Nani) వాయిస్‌ఓవర్ ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

25 ఏళ్లలోపు ఓ కుర్రాడు 30 మందిని..
“25 ఏళ్లలోపు ఓ కుర్రాడు 30 మందిని తిండి, నిద్ర లేకుండా పరిగెత్తించాడు” అనే నాని డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అడవిలోని ప్రేమ సన్నివేశాలు, యాక్షన్ దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ‘కలర్ ఫొటో(Colour Photo)’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సాక్షి మహదోల్కర్(Sakshi Mahdolkar) హీరోయిన్‌గా నటిస్తుండగా, కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ గ్లింప్స్ సోషల్ మీడియా(SM)లో వైరల్‌గా మారింది. రోషన్‌ను ఓ బలమైన హీరోగా చూపిస్తూ, ప్రేమ కథలో విలన్‌తో సమానమైన పాత్రను చూపించారు. మరి తన రెండో సినిమాతో రోషన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియాలి అంటే విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.






