నేటి నుంచి AP అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం10 గంటలకు గవర్నర్ ప్రసంగం

ఇవాళ్టి నుంచి (ఫిబ్రవరి 24) ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు పాటు నిర్వహించాలనే దానిపై బీఏసీ మీటింగ్(BAC Meeting) జరుగుతుంది. కాగా మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఇక ఈనెల 26న మహా శివరాత్రి(Maha Shivaratri) కావడం, 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Elections) నేపథ్యంలో సభ ఉండదు.

ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా సాగే అవకాశం

తిరిగి మళ్లీ 28న సభ ప్రారంభానికి ముందే సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. ఇందులో బడ్జెట్‌(Budget)పై చర్చ, ఆమోద ముద్ర వేస్తారు. అనంతరం అదే రోజు సభలో2025-26కి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) సభలో ప్రవేశపెడతారు. అనంతరం మార్చి 3వ తేదీ నుంచి బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని YCP అధినేత వైఎస్ జగన్(YS Jagan) నిర్ణయించారు. దీంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగే అవకాశం ఉంది.

Related Posts

స్పీకర్ సంచలన నిర్ణయం.. 6 నెలల పాటు BJP MLAల సస్పెండ్!

కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly) స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన18 మంది BJP MLAలపై ఆరు నెలల సస్పెన్షన్ వేటు పడింది. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు వారిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్ యూటీ ఖాదర్(Speaker UT Khadhar)…

నారా లోకేష్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ.. వీడియో వైరల్

రాజకీయాల్లో శత్రుత్వమైనా.. స్నేహమైన శాశ్వతం కాదంటారు పెద్దలు. ఇవాళ ఈ పార్టీలో ఏళ్ల తరబడి నమ్మకంగా ఉన్న వాళ్లు అకస్మాత్తుగా పార్టీ మార్చి తిట్టడం మొదలు పెట్టిన వారూ ఉన్నారు. అవతలి పార్టీలో ఉండి ఏళ్లుగా విమర్శిస్తున్న వారు సడెన్ గా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *