నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువు గా చూస్తే తట్టుకోలేరు..!

మన ఈనాడు:
నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువు గా చూస్తే తట్టుకోలేరు అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ మంచి చేయాలనే మీ ముందుకు వచ్చానని తనను ఓ ఫ్రెండ్ గా చూడాలని అన్నారు.
జిల్లా తాడిమర్రి మండలం నిడిగల్లు బహిరంగ సభలో ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొని మాట్లాడారు. తాను అందరికీ మంచి చేయాలనే మీ ముందుకు వచ్చానని తనను ఓ ఫ్రెండ్ గా చూడాలని అన్నారు. ఇక్కడ చెట్లు నరికడం చూసి.. తనకు చాలా బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు నరికే ఈ విష సంస్కృతికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

అటువంటి విష సంస్కృతికి ముగింపు పలకాలనే ఉద్ధేశ్యంతోనే తాను మొక్కలు పంచడం మొదలు పెట్టానని..తన తండ్రి పరిటాల రవీంద్ర ఇచ్చిన స్ఫూర్తితో ఈ కార్యక్రమం మొదలు పెట్టానని తెలిపారు. అప్పట్లో ప్రత్యర్థులు ఇళ్లు కూల్చివేస్తే.. పరిటాల రవి ఇళ్లు కట్టించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన రక్తాన్ని మాత్రమే కాదు ఆయన ఆశయాలను కూడా మేం పంచుకున్నామని వాటిని అమలు చేస్తున్నామని అన్నారు. అందుకే పది చెట్లు నరికితే 100చెట్లు పంచుతా..100నరికితే 1000, వెయ్యి నరికితే 10వేలు పంచుతా..10వేలు నరికితే లక్ష చెట్లు పెంచుతానని అన్నారు.

ఇది ఎన్నికల కోసం అని అనుకోవద్దు..మొక్కలు పంచే కార్యక్రమం చాలా మంచిది. ఇది రాజకీయాల కోసం చేసే కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. మొక్కలు పంచే ఈ కార్యక్రమం వెనుక నా తల్లి ప్రోత్సాహం ఉందని తెలిపారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎర్రన్నాయుడు తరహాలో పోరాడుతున్నారని అన్నారు. ఈ జిల్లాలో మొక్కలు నాటి చెట్లు పెంచటం అంటే ముందుగా గుర్తొచ్చిది మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అని అన్నారు.

Related Posts

Khammam|కార‌ణం తెలియ‌దు కానీ..ఖ‌మ్మం ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి త‌న‌కి ఇంకా కార‌ణం తెలియ‌దు కానీ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, పోలీస్ క‌మిష‌న‌ర్‌తో క‌లిసి గురువారం ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో ప్ర‌మాదం జ‌రిగిన తీరును…

BIG BREAKING: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుల దాడి

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై(Mumbai)లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగులు ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆయనపై కత్తితో అటాక్(Knife Attack) చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *