సీఎం జగన్ ఒంగోలు పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23న ఆయన ఒంగోలులో పర్యటించనున్నారు. ఒంగోలు నగర పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
CM Jagan: సీఎం జగన్ ఒంగోలు పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 23న ఆయన ఒంగోలులో పర్యటించనున్నారు. ఒంగోలు నగర పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలు మండలం ఎన్.అగ్రహారం చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.